స్మార్ట్ ఫోన్లకు బానిస కావొద్దు:

జ్ఞాన తెలంగాణ, నారాయణపేట టౌన్, జూన్ 11:

నారాయణపేట మైనారిటీ గురుకుల బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులు సెల్ ఫోన్లకు దూరంగా వుండాలని, విద్యపై దృష్టి పెట్టాలని ఏఎస్సై శ్రీదేవి గారు తెలుపుతూ సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలని, అనవసరపు లింకులు ఓపెన్ చేయరాదని, లాటరీ తగిలిందని వచ్చే ఫోన్ కాల్స్ నమ్మకండని చెప్పారు. సైబర్ నేరాల పై ఇప్పటికే దేశంలో రాష్ట్రంలో అనేక చోట్ల సామాన్య ప్రజలకు బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు మాయమైపోతున్నాయి అందుకని ఫోన్ల విక్రయాలపై జాగృత వహించి ఎలాంటి వాటిపై అవగాహన లేనిదే లింక్ లు ఓపెన్ చేయరాదని అతి చిన్న వయసులోనే అనవసరమైన వాటికి బానిస కాకుండా విద్యా వైపు మొగ్గు చూపుతూ తల్లి తండ్రుల కళలను నిజం చేయాలని తెలిపారు.ర్యాగింగ్ వంటి ,విద్యార్థులను ఇబ్బంది చేయడం చట్టరీత్య నేరమని, మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు .

You may also like...

Translate »