నిబంధనలు పాటించని స్కూల్ బస్సులపై చర్యలు చేపట్టాలి.

నిబంధనలు పాటించని స్కూల్ బస్సులపై చర్యలు చేపట్టాలి.
జ్ఞాన తెలంగాణ – బోధన్
నిబంధనలు పాటించని ప్రయివేటు పాఠశాలల బస్సులను తనిఖీ చేసి చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం ఏబీవీపీ నాయకులు ఆర్టీసీ వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా తెలంగాణ విద్యార్థి పరిషత్ బోధన్ డివిజన్ అధ్యక్షులు మీసాలే నాగేష్ మాట్లాడుతూ ప్రైవేట్ ,కార్పొరేట్ స్కూల్స్ బస్సులు ఫిట్నెస్ బస్సు కండిషన్ ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే డ్రైవర్ కి డ్రైవింగ్ లైసెన్స్ , బస్సులో ఫస్ట్ ఎయిడ్ కిట్ అందుబాటులో ఉండేలా చూడాలని ,నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో శివ తదితరులు పాల్గొన్నారు.
