బక్రీద్ పండుగ సంధార్బంగా వికారాబాద్ జిల్లాలో 10 చెక్ పోస్ట్ లు ఏర్పాటు


• జిల్లాఎస్పీ నంద్యాల కోటి రెడ్డి .

జ్ఞాన తెలంగాణ న్యూస్//వికారాబాద్ జిల్లా//నవాబుపేట్ మండలం//
వికారాబాద్ జిల్లాలో బక్రీద్ పండుగ సంధార్బంగా శాంతిబద్రతలకు ఎలాంటి విఘాతం కల్గకుండా మరియు జంతువుల అక్రమ రవాణా ను అరికట్టుట కొరకు జిల్లాలో 10 చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేయడం జరిగింది అని జిల్లా ఎస్పీ తెలిపినారు. ఈ సందర్బంగా ఎస్‌పి మాట్లాడుతూ బక్రీద్ పండుగ సంధార్బంగా గోవులు,లేగదూడల అక్రమ రవాణాను చేయవద్దు అని, జిల్లాలో శాంతిబద్రతలు, జంతు అక్రమ రవాణాను అరికట్టుటకు జిల్లాలో వికారాబాద్ పోలీస్ స్టేషన్, ధరూరు పోలీస్ స్టేషన్, మోమిన్ పేట్ పోలీస్ స్టేషన్, చెంగోముల్ పోలీస్ స్టేషన్, పరిగి పోలీస్ స్టేషన్ , తాండూర్ పోలీస్ స్టేషన్ మరియు యాలాల పోలీస్ స్టేషన్ ల పరిధిలలో మొత్తం 7 అంతర్ జిల్లా చెక్ పోస్ట్ లు మరియు బషీరాబాద్ పోలీస్ స్టేషన్, కరణ్ కోట్ పోలీస్ స్టేషన్ మరియు కొడంగల్ పోలీస్ పరిధిలలో 3 అంతర్ రాష్ట్ర చెక్ పోస్ట్ లు మొత్తం జిల్లాలో 10 చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేయడం జరిగింది. పశువుల వ్యాపారులు పశువుల క్రయ,విక్రయాలలో భాగంగా ఖచ్చితంగా గ్రామ పంచాయితీ లేదా మున్సిపలిటి అధికారుల చేత ధృవీకరించిన రశీదులను ఖచ్చితంగా కలిగి ఉండాలి. పశువుల రవాణా సమయంలో కచ్చితంగా నియమానిబంధనలు పాటించాలని, ఎవరైనా పశువులను అక్రమంగా రవాణా చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయి అని ఎస్పీ హెచ్చరించారు. ఇట్టి అక్రమరవాణా చేస్తున్నట్టు ఎవరికైనా సమాచారం తెలిస్తే పోలీస్ అధికారులకు గాని డైల్ 100 కి గాని సమాచారం అందించాలని, అలా కాకుండా వారిపై భౌతికంగా ధాడులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

You may also like...

Translate »