ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో ఎన్ఆర్ఐలు భాగస్వామ్యులు కావాలి

సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గూడూరు లక్ష్మీ నర్సింహా రెడ్డి

జ్ఞాన తెలంగాణ,(కడ్తాల్)

అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఆటా 2024 కన్వెన్షన్ లో ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం కార్యక్రమంలో సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గూడూరు లక్ష్మీనరసింహారెడ్డి పాల్గొన్నారు. టిడిఎఫ్ అధ్యక్షుడు భూపాల్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రవాస భారతీయులు తెలంగాణలో విద్య,వైద్యం,నీటిపారుదల మొదలగు అంశాల పైన చర్చించినట్లు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలలో అమలవుతున్న విద్యా పధకాలు సత్ఫలితాలు సాధించే దిశగా ప్రభుత్వ మరియు ప్రవాసభారతీయుల భాగస్వామ్యంపై చర్చించినట్లు తెలిపారు.

సమావేశంలో ఎల్ ఎన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు విద్యాభ్యాసం మరియు క్రీడలలో సాధించిన విజయాలను అందరికి తెలిసే విధంగా ప్రతి గ్రామంలో కరపత్రాల ద్వారా లేదా అందుబాటులో ఉన్న వ్యవస్థ ద్వారా ప్రచారం నిర్వహించాలని ఎక్కువ మొత్తంలో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభ్యాసం చేసే విధంగా పాఠశాల అధ్యాపకులతో కలిసి ప్రణాళికను రచించాలని కోరారు. సొంత గ్రామాలలో పాఠశాలల అభివృద్ధికి ఎన్ఆర్ఐలు సహకరించాలని, ప్రతి ఎన్నారై సొంత ప్రాంతాలలో ఉన్న పాఠశాలను దత్తత తీసుకొని పాఠశాలల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు.ఈ కార్యక్రమంలో టిడిఎఫ్ ఫౌండర్ మధు కె రెడ్డి,కిషోర్ గూడూరు,భరత్ రెడ్డి,ప్రీతి, నర్సింహ రెడ్డి,సుభాష్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »