ప్రతి కార్యకర్తకు కంటి రెప్ప నేనౌతా

జ్ఞానతెలంగాణ, చిట్యాల, జూన్ 10:

భూపాలపల్లి నియోజకవర్గంలోని బీ ఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా మారి కాపాడుకుంటానని తెలంగాణ తొలి శాసనసభాపతి ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి అన్నాడు. చిట్యాల మండల కేంద్రంలోని బీ ఆర్ఎస్ పార్టీ టౌన్ అధ్యక్షుడు బుర్ర శ్రీధర్ తల్లి వెంకటలక్ష్మి మృతి చెందగా సోమవారం దశదినకర్మను నిర్వహించారు ఈ కార్యక్రమానికి హాజరైన సిరికొండ మధుసూదన చారి వెంకటలక్ష్మి చిత్రపటానికి పూలను వేసి నివాళులర్పించారు.

అనంతరం పార్టీ కార్యకర్తలు నాయకులను కలిసిన క్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల పట్ల కార్యకర్తలు నాయకులు ఎవరు కంగారు పడవలసిన అవసరంలేదని, ప్రస్తుత ప్రభుత్వ పాలన విధానాలన్నీ ప్రజలకు అర్థమవుతున్నాయని ఆయన తెలిపారు. పార్టీ కోసం ప్రజల కోసం పనిచేసే వారు ఎవరు పార్టీలు మారారని కేవలం తమ స్వార్థం కోసం మాత్రమే కొంతమంది రకరకాల పార్టీలకు వెళ్లి తిరిగి వస్తుంటారని అలాంటి వారికి సమాజంలో ఎలాంటి విలువ దక్కదు అన్నారు.

కష్టకాలంలో పార్టీతో కలిసి వచ్చిన వారిని మాత్రమే ప్రాణప్రదంగా చూసుకుంటామన్నారు ప్రతి కార్యకర్తకు కష్టాల్లో అండగా నిలుస్తామని తెలిపారు. బీ ఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా స్పీకర్ గా గతంలో కొనసాగిన తను భూపాలపల్లిని జయశంకర్ జిల్లాగా మార్చడంతో పాటు నియోజకవర్గం అభివృద్ధి కోసం 3500 కోట్ల నిధులు తెచ్చి అభివృద్ధి చేశానన్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీగా కొనసాగుతూ నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడతానని నిత్యం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు అందుబాటులో ఉంటానని ఆయన చెప్పారు.

ముందు ముందు మనకు మంచి రోజులు వస్తాయని ఇప్పుడున్న పరిస్థితులు ఎప్పటికీ ఉండవని నాయకులు, కార్యకర్తలు ఆందోళన పడవద్దు అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ జిల్లా మండల నాయకులు చింతల రమేష్ ముదిరాజ్, జన్నే యుగేందర్, ఇజ్జిగిరి ఆనందం, పువ్వాటి హరికృష్ణ,సంగా రాజేందర్, తీగల బాలకృష్ణ, ఉప్పుల కిరణ్, కంచర్ల కుమార్, రాయిని శ్రీకాంత్, గొల్లపల్లి రాజు, వేణు వంక శ్రీదేవి, మోత్కూరు సంతోష్,మూసాపురి రవి, రమేష్,బండి మొండయ్య, గోపు బిక్షపతి,నర్సింగరావు రమేష్, సాయి గణేష్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »