మున్సిపల్ కమిషనర్ గారిని అవమానించిన చైర్మన్

మున్సిపల్ కమిషనర్ గారిని అవమానించిన చైర్మన్ :
జ్ఞాన తెలంగాణ సిద్దిపేట :
సాటి మహిళను కూడా గౌరవించే సంస్కృతి లేదా,
మీకు రోజులు దగ్గర పడ్డాయి అధికారం శాశ్వతం కాదు,
త్వరలోనే మున్సిపల్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతాం.
కాంగ్రెస్ అధికారంలో ఉందని అధికారులను కించపరుస్తారా,
కమిషనర్ కు వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలి.
సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్,
సిద్ధిపేట;
మునిసిపల్ సమావేశంలో స్టేజ్ పైన ఉండాల్సిన మునిసిపల్ కమిషనర్ ప్రసన్న రాణిని మునిసిపల్ చైర్ పర్సన్ మంజుల రాజనర్స్ గారు స్టేజ్ కింద కూర్చోబెట్టి అవమానించారని సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ మండిపడ్డారు. సిధ్ధిపేటలో ఆయన మాట్లాడుతూ సోమవారం మునిసిపల్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆడవారిని మర్యాదించాల్సింది పోయి కావాలని చైర్ పర్సన్ మంజుల గారి భర్త రాజనర్సు కనుసన్నల్లో పనిచేస్తున్న కొందరు కౌన్సిలర్లు కమిషనర్ ప్రసన్న రాణి పట్ల అమర్యాదగా ప్రవర్తించి సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరించారని అన్నారు. సమావేశంలో సాటి మహిళకు అవమానం జరుగుతుంటే తనకు ఏమి పట్టనట్లుగా చైర్పర్సన్ మంజుల గారు మాట్లాడకపోవడం సిగ్గుచేటని అన్నారు. సాటి మహిళగా అంతలా అవమానిస్తుంటే మీ సంస్కృతి ఎక్కడికి పోయిందని అన్నారు. ఇదేనా మీరు మహిళలకు ఇచ్చే సంస్కృతి అని మండిపడ్డారు. అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదని ఈ ఎన్నికల్లో తేలిపోయిందని అయినా మీకు ఇంకా బుద్ధి రాలేదని అన్నారు. గత కొన్ని ఏళ్లుగా మునిసిపల్ మాదే అని విర్ర వీగుతున్న వారికి రోజులు దగ్గర పడ్డాయని వారికి రానున్న మునిసిపల్ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయమని అన్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు పక్కన కూర్చున్న పెట్టుకున్న కమిషనర్లు ఏమయ్యారని కావాలనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని అధికారులను కించపరిచేలా వ్యవహరిస్తున్న వారికి త్వరలోనే బుద్ధి చెప్తామని అన్నారు. త్వరలోనే తమతో టచ్ లో ఉన్న మునిసిపల్ కౌన్సిలర్ల తో సంప్రదింపులు జరిపి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని హెచ్చరించారు. మునిసిపల్ కార్యాలయంలో పెత్తనం చెలాయించేలా వ్యవహరిస్తున్న చైర్మన్ భర్త రాజనర్సకు ఏం పని అని ఇంకా అతనే చైర్మన్ లాగా వ్యవహరిస్తున్నారని ఆ భ్రమల నుండి బయటకు రావాలన్నారు. కమిషనర్ ను కించపరిచేలా అవమానించిన కౌన్సిలర్లు మున్సిపల్ చైర్మన్ మంజుల రాజ నర్సులు వెంటనే భేషరతుగా క్షమాపణ చెప్పాలని లేకపోతే మునిసిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట పట్టణ కార్యదర్శి గ్యదారి మధు. సిద్దిపేట యువజన పట్టణ అధ్యక్షులు గయాజుద్దీన్. ఎన్ ఎస్ యు ఐ వర్కింగ్ ప్రెసిడెంట్ రాశాద్. నజ్జు ఫయాజ్ అభినవ్ రెడ్డి రవితేజ తదితరులు పాల్గొన్నారు