నీట్ 2024 ను రీ -ఎగ్జామ్ నిర్వహించాలి

  • నేషనల్ టెస్టింగ్ ఎజెన్సీ(NTA) ను రద్దు చేయాలి
  • జరిగినటువంటి అవకతవకమైన న్యాయ విచారణ జరిపించారు
  • ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టి. ప్రవీణ్

జ్ఞాన తెలంగాణ జూన్ 10, ఖమ్మం జిల్లా బ్యూరో చీఫ్: భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా కమిటీ పిలుపులో భాగంగా ఎన్.టి.ఎ. నిర్వహించిన నీటి పరీక్షలో జరిగిన అవకతవకల పైన పైన విచారణ జరిపించాలని ఖమ్మం నగర కేంద్రంలోని నూతన మున్సిపాలిటీ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్.ఎఫ్.ఐ జిల్లా కార్యదర్శి టి ప్రవీణ్ మాట్లాడుతూ జూన్ 04న ఎలాంటి హడావుడి లేకుండా దేశంలో సారత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లవడుతున్న సమయంలో, నీట్ పరీక్ష ఫలితాలు నేషనల్ టెస్టింగ్ ఎజెన్సీ(ఎన్.టి.ఎ) ప్రకటించింది. ముందుగా జూన్ 14న అని ప్రకటించి ముందుగానే ఎలాంటి సమాచారం లేకుండా ఫలితాలు వెల్లడించడం పై దేశ వ్యాప్తంగా అనేక ఫిర్యాదులు వస్తున్నాయి.ప్రధానంగా ఎన్.టి.ఎ ను తీసుకుని వచ్చిన నుండి దాని పారదర్శకత పై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.గత పరీక్షలలో ఎన్.టి.ఎ.చేసిన ఘోర తప్పిదాలను, అవకతవకలు మళ్ళీ పునారవృతం అవుతున్నాయి.
ఎం.బి.బి.ఎస్-బి.డి.ఎస్ గ్రాడ్యుయేట్ స్థాయి ప్రవేశ పరీక్షలో మొత్తం మార్కులు 720. ప్రతి సరైన సమాధానానికి 4 మార్కులు ఇవ్వబడతాయి, అయితే ప్రతి తప్పు సమాధానానికి మొత్తం నుండి 1 మార్కు తీసివేయబడుతుంది, అయితే సమాధానం లేని ప్రశ్నలు గుర్తించబడవు. అలాంటప్పుడు, 719 మరియు 718 వంటి మార్కులు పొందడం గణితశాస్త్రంలో సాధ్యం కాదు. కానీ అలాంటి సందర్భాలు ఈ ఫలితాల్లో కనిపించాయి. ఈ ఏడాది ఫలితాలు గ్రేస్ మార్కింగ్ కోసం ఎన్ టి ఏ క్యాజువల్‌గా ఒక ప్రకటనలో తెలిపింది. కానీ ఈ ఏడాది పరీక్షకు ముందు ఎన్ టి ఏ ప్రచురించిన మార్గదర్శకాలలో ఎక్కడా ఈ గ్రేస్ మార్కింగ్ పథకం గురించి ప్రస్తావించలేదు. ఒకే పరీక్ష కేంద్రానికి సంబంధించినటువంటి ఎనిమిది మంది విద్యార్థులకు ఆల్ ఇండియా ర్యాంకులు రావడం, అలాగే గుజరాత్ రాష్ట్రంలో ఒక ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీకి సంబంధించినటువంటి యాజమాన్యం ముందస్తుగానే విద్యార్థుల నుండి పది లక్షల నుండి 20 లక్షలు తీసుకొని పేపర్ లీడ్ చేసినట్లు పాట్నాలో కూడా విద్యార్థుల నుండి 20 నుండి 30 లక్షలు తీసుకొని పేపర్ చేసినట్లు, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో వేరే రాష్ట్రాలకు పెట్టినటువంటి పేపర్ కాకుండా మరొక పేపర్ వచ్చినట్లు ఎన్నో అనుమానాలు దేశవ్యాప్తంగా వస్తా ఉన్నాయి వీటన్నిటి పైన న్యాయవిచారణ జరిపించాలని
అంతేకాకుండా, ఒకే సెంటర్ నుండి వరుసగా రోల్ నంబర్లు ఉన్న విద్యార్థులు ఒకే మార్కులను పొందారని ఫిర్యాదులు ఉన్నాయి, యాదృచ్ఛికంగా 720 కి 720 వచ్చాయి. అంటే ఈ ఫలితాలును బట్టి అభ్యర్థులు ఇక నుండి ర్యాంకులు వచ్చిన ఆయా ప్రైవేట్ కాలేజీలలో అడ్మిషన్ తీసుకోవలసి వస్తుంది, ఇది సిలబస్‌లో గణనీయమైన తగ్గింపు వంటి ఎన్.టి.ఎ. విధానాల కారణంగా. మోదీ ప్రభుత్వ హయాంలో ఎన్‌ఎంసీ, ఎన్‌టీఏ సంయుక్తంగా వైద్య విద్యను ప్రైవేటీకరించిన తీరు దేశ భవిష్యత్తుకు ప్రమాదకరం. వైద్య రంగంలో రాష్ట్ర ఆధారిత ఉమ్మడి ప్రవేశ పరీక్ష విధానాన్ని మార్చడం వల్ల అంతులేని అవినీతి జరిగిందన్న వాదన ఇప్పుడు నీట్-యూజీకి సంబంధించి కూడా ముందుకు వస్తోంది. ఈ ఘటనపై తక్షణమే పారదర్శకంగా, నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా డిమాండ్ చేస్తోంది. ఎన్.టీ.ఎ, ని రద్దు చేయాలని మరియు ఇప్పటి వరకు దాని స్కామ్‌లన్నింటినీ విచారించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఎన్.టీ.ఎ,ద్వారా విద్య కేంద్రీకరణకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించాలని ఎస్.ఎఫ్.ఐ దేశవ్యాప్తంగా విద్యార్థి సమాజానికి పిలుపునిస్తుందని. సమగ్రమైన విచారణ జరిపించి, రీ – ఎగ్జామ్ నిర్వహించాలని ఎస్ఎఫ్ఐ కోరుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు రాజు నాయకులు కీర్తన, నవ్య, అనుష ,శివాని, భావన, గంగోత్రి తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »