బిజెపి శ్రేణులు సంబరాలు

బిజెపి శ్రేణులు సంబరాలు
జ్ఞాన తెలంగాణ హన్మకొండ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా హనుమకొండ జిల్లాలో బిజెపి జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ ఆధ్వర్యంలో కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన సందర్భంగా బిజెపి శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా రావు పద్మ మాట్లాడుతూ… బిజెపితోనే దేశం అభివృద్ధి చెందుతుందని అలాగే వరంగల్ సమగ్ర అభివృద్ధి సాధ్యమని,రాబోయే ఎన్నికల్లో వరంగల్ లో బిజెపి సత్తా చూపిస్తామన్నారు.అలాగే కేంద్రంలో మూడోసారి అధికారాన్ని చేపట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు కేంద్ర మంత్రులకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం టపాకాయలు పేల్చి సంబరాలు చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.