ఉద్యమ కారుల కి ఇచ్చిన హామీలను వెంటనే అమలుచేయాలి

జ్ఞాన తెలంగాణ చేవెళ్ల జూన్ 09

తెలంగాణ ఉద్యమ కారుల ఫోరమ్ చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం ఇంచార్జి యాలల మహేశ్వర్ రెడ్డి
మాట్లాడుతూ ఉద్యమ కారుల అంశం గత ఎన్నికలల్లో అజండా మార్చమని . ఉద్యమ కారుల కి 250 గజాల స్థలం హామీని సాధించటం లో మన టఫ్ ముఖ్య భూమిక పోషించిందని అన్నారు.
ఉద్యమ నాయకులు గా చెప్పుకునే వాళ్ళు రాజ కీయ పార్టీ నీ పెట్టుకొని ఉద్యమ కారుల నీ పూర్తిగా మరచి పోయిన సమయం లో మనం తెలంగాణ ఉద్యమ కారుల ఫోరమ్ నీ పిడికెడు మందితో ఎర్పాటు ఇంకా ఉద్యమ కారుల అంశం ఎందుకు అని కొంతమంది ఏద్దేవా చేశారని . ఇదీ అయితదా అని సందేహించారు. అయినా పట్టు వదల కుండా ఆనేక కార్య క్రమాలు ను చేశాం జిల్లాల వరిగ తిరుగుతూ ఉద్యమ కారుల నీ ఐక్యం చేస్తూ కమిటీలు వేస్తూ ఉద్యమ కారుల అంశాన్ని సజీవంగా ఉంచామని తెలిపారు .
కాని నిన్నటి వరకు గత 6 సంవత్స రాలు గా ఉద్యమ కారుల ను పట్టించు కోని రాజకీయాలు చేసిన వాళ్లు నేడు ఉద్యమ కారులను మభ్య పెడుతున్నారు. ఒక సారి ఆలోచించండి గత 6 సంవత్స రాలు గా ఉద్యమ కారుల గురించి ఏమైనా కార్యక్రమాలు చేశారా వీళ్ళు?
అని ప్రశ్నించారు.తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పని చేసిన వాళ్ళం.

  1. మలి దశ ఉద్యమంలో పని చేసిన వాళ్ళం.
  2. తెలంగాణ ఏర్పాటు తర్వాత తెలంగాణ ఉద్యమ కారుల ను మీరు మరచి పోతే మళ్ళీ ఉద్యమ కారుల కోసం పని చేస్తున్న వాళ్ళము.
    మా తెలంగాణ ఉద్యమ కారుల ఫోరమ్ తరపున మీకు
    నేటి వరకూ గౌరవించామని,మిమ్మల్ని కాని తెలంగాణ ఉద్యమ కారుల కి నిజమైన శతృవులు ద్రోహులు మీరే.అని విమర్శించారు.
    ఉద్యమకారులను కేవలం మీ పదవుల కోసం ప్యాకేజ్ ల కోసం మమ్మల్ని నేటి వరకూ పావులుగా వాడు కుంటున్నరు తప్ప చిత్తశుద్ధి తో మాట్లాడడం లేదని మళ్ళీ పడ్డారు.
    మీ కుటిల రాజకీయాలను కుట్రలను తిప్పికొట్టాలని తెలంగాణ ఉద్యమ కారుల కి పిలుపు నిస్తున్నం. ఉద్యమ కారులకి ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని యీ నెల కార్యాచరణ ప్రకటిస్తున్నము. నిజ మైన ప్రతి ఉద్యమ కారుడిగి ప్రభుత్వం ఇచ్చే ఫలాలు దక్కే లాగున మన టఫ్ పని చేస్తుందని తెలిపారు.
    ఉద్యమకారుల డిమాండ్ లు
    1.తెలంగాణ ఉద్యమ కారుల ను గుర్తించటానికి కమిటీ ఏర్పాటు చేయాలి
    2.ప్రతి ఉద్యమ కారుడికి గుర్తింపు కార్డు ను ఇవ్వాలి
    3.తెలంగాణ రాష్ట్ర సాధకులు గా గుర్తించాలి
    4.తెలంగాణ ఉద్యమ కారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి
  3. ఉద్యమ కారుల కి ఇచ్చిన హామీలను వెంటనే అమలుచేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

You may also like...

Translate »