చిట్యాలలో బిజెపి సంబరాలు.

చిట్యాలలో బిజెపి సంబరాలు.
జ్ఞానతెలంగాణ, చిట్యాల, జూన్ 09:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రము లొ ఆదివారం రోజున భారత దేశ ప్రధానమంత్రి గా ముచ్చటగా మూడోసారి మోదీ ప్రమాణ స్వీకారము చేసిన సందర్భంగా బిజెపి చిట్యాల మండల అధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో స్వీట్స్ పంపిణీ చేసి, బాణసంచ కాల్చడం జరిగింది,అనంతరం బుర్ర వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ దేశ ప్రజలందరూ మరోసారి మోదీ సర్కార్ కావాలని ఓటు వేసి మోదీ గారి పరిపాలన మాకు ఎంతో అవసరం అని,దేశ అభివృద్ధిలో మోదీ గారు ఎంతో శ్రమిస్తున్నారు అని,ప్రపంచ దేశాలు భారత్ వైపు చూసే విధంగా దేశాన్ని ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానానికి చేరెలా మోదీ కృషి చేస్తునారు అని అన్నారు, ఈ కార్యక్రమములో బిజెపి సీనియర్ నాయకులు గుండా సురేష్, గజనాల రవి, పంచింక మహేష్, బుర్రి తిరుపతి,రాయిని శ్రీనివాస్, మైదం శ్రీకాంత్,రాజేందర్,శ్రీహరి,ప్రభాకర్,జగదీష్, కిశోర్,శ్రావణ్,తిరుపతి తదితరులు పాల్గొన్నారు.