ప్రధాని ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే

ప్రధాని ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే
జ్ఞాన తెలంగాణ జైనథ్ జూన్ 09:
భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొన్నారు.ఆదివారం సాయంత్రం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ దేశ ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోడీ భాద్యతలు చేపట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు.భారతదేశానికి ప్రపంచ స్థాయిలో మోడీ వల్ల గుర్తింపు లభించింది అన్నారు.
