కేసముద్రం లో ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన

వేముల. శ్రీనివాస్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే మురళి నాయక్.

జ్ఞాన తెలంగాణ కేసముద్రం,
జూన్ 09.

కేసముద్రం మండలంలో మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ భూక్య మురళి నాయక్ సుడిగాలి పర్యటన చేసినారు. మొదటగా కలవల గ్రామంలో నమస్తే తెలంగాణ రిపోర్టర్ కొండ్రెడ్డి యాకూబ్ రెడ్డి గారి తండ్రి రామ్ రెడ్డి స్వర్గస్తులు అయిన విషయం తెలుసుకొని వారి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. అదేవిధంగా కేసముద్రం మండల కేంద్రంలోని భానోతు వీరన్న మాజీ వార్డు సభ్యులు స్వర్గస్తులు కాగా పార్ధీవ దేహాన్ని సందర్శించి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది.

కేసముద్రం విలేజ్ చెందిన వేముల.శ్రీనివాస్ రెడ్డి తండ్రి వేముల.సత్తిరెడ్డి స్వర్గస్తులు కాగా విషయము తెలుసుకొని వారి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. అదేవిధంగా చైతన్య నగర్ కు చెందిన పెండ్యాల. లక్ష్మణ్ కు బైక్ యాక్సిడెంట్ అయ్యి గాయాలు కాగా వారి నివాసానికి వెళ్లి పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈమధ్య కొన్ని రోజుల క్రితం హనుమకొండ శ్రీనివాసా పినాకిని హాస్పిటల్ లో కలవల గ్రామానికి చెందిన మాజీ వైస్ ఎంపీపీ మూరగుండ్ల అనంతరాములు పొందుతున్న విషయం తెలుసుకొని హాస్పిటల్ కి వెళ్లి డాక్టర్లతో ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ధైర్యంగా ఉండమని కుటుంబానికి అండగా ఉంటానని ధైర్యం చెప్పడం జరిగింది. అదేవిధంగా మూడు రోజుల క్రితం పెనుగొండ క్రాస్ రోడ్ వద్ద సబ్స్టేషన్ తండా జిపి మాజీ సర్పంచ్ గుగులోతు వెంకన్న లారీ యాక్సిడెంట్లో తీవ్ర గాయాలపాలై హనుమకొండ లోని హజారియా హాస్పిటల్లో చికిత్స జరుగుతుండగా హాస్పిటల్ కి వెళ్లి వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు చెప్పి కుటుంబానికి అండగా ఉంటానని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిసిసి ఉపాధ్యక్షులు అంబటి. మహేందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు అల్లం. నాగేశ్వరరావు, టీపీసీసీ సభ్యులు గగులోతు.

దసురు నాయక్, మాజీ సింగిల్ విండో చైర్మన్ బండారు.వెంకన్న, బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పోలేపాక.నాగరాజు, బండారు. దయాకర్, కదిరే.సురేందర్ ఎక్స్ జెడ్పిటిసి, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు గందసిరి. శ్రావణ్, స్టేషన్ మాజీ సర్పంచ్ బట్టు
శ్రీనివాస్, కేసముద్రం టౌన్ అధ్యక్షులు రావుల. మురళి,మాజీ ఉపసర్పంచ్ చిన్న వెంకన్న, యూత్ కాంగ్రెస్ నాయకులు తరాల.వీరేష్ యాదవ్ పాల్గొన్నారు.

You may also like...

Translate »