మద్యం మత్తులో లారీ డ్రైవర్ ని హత్య చేసిన స్నేహితులు

మద్యం మత్తులో లారీ డ్రైవర్ ని హత్య చేసిన స్నేహితులు
జ్ఞాన తెలంగాణ
రాజేంద్రనగర్ ప్రతినిధి
అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో లారీ డ్రైవర్ ని తోటి స్నేహితులు దారుణంగా హత్య చేశారు. మద్యం తాగిన తర్వాత సీసాలు పగలగొట్టి గొంతు కోసి చంపారు.ఇన్స్పెక్టర్ వెంకటరామిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..
అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సులేమాన్ నగర్ కు చెందిన లారీ డ్రైవర్ లాయిక్ (30) ను శనివారం అర్ధరాత్రి ముగ్గురు స్నేహితులు అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 258 వద్దకు మద్యం తాగేందుకు తీసుకెళ్లారు. అక్కడ ఏం జరిగిందో ఏమో గాని మద్యం సీసాలు పగలగొట్టి అతని గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. ఈ సమాచారం అందుకుని సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీమ్, ఆధారాలు సేకరించారు.
ఇన్స్పెక్టర్ వెంకటరామిరెడ్డి పోలీసు ఉన్నతాధికారులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. పాత కక్షల నేపథ్యంలో హత్య జరిగి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. యువకుడి మర్డర్‌తో ఒక్కసారిగా కలకలం రేగింది. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ వెంకటరామిరెడ్డి తెలియజేశారు.