జననాయక్ భగవాన్ బిర్సా ముండా 124 వ,వర్థంతి నేడు

జననాయక్ భగవాన్ బిర్సా ముండా 124 వ, వర్థంతి నేడు

ఆదివాసీ స్వాభిమాన పోరాట యోధుడు,జననాయక్ గా కీర్తించబడుతోన్న బిర్సా ముండా, జార్ఘండ్ లోని ఖుంతీ జిల్లా, ఉలిహతు గ్రామంలో 1875 వ సంవత్సరంలో నవంబర్ 15 వ తేదీన జన్మించారు.ఇతను ముండా అనే జాతికి చెందిన వ్యక్తి.

ముండా ప్రజలు భారతదేశానికి చెందినవారు. వారు మాతృభాష ముండారి. ఇది ఆస్ట్రోయాసియాటికు భాషాకుంబాలకు చెందిన ముండా ఉప సమూహానికి చెందినది. ముండా తూర్పు భారతదేశంలోని ఉత్తర ప్రాంతాలలో జార్ఖండు, ఒరిస్సా, పశ్చిమ బెంగాలు రాష్ట్రాలలో కేంద్రీకృతమై ఉంది. ముండా బీహారు, ఛత్తీసుగఢు అరుణాచల ప్రదేశు ప్రక్కనే ఉన్న ప్రాంతాలతో పాటు బంగ్లాదేశులోని కొన్ని ప్రాంతాలలో కూడా నివసిస్తున్నారు. ఈ సమూహం భారతదేశపు అతిపెద్ద షెడ్యూల్డు తెగలలో ఒకటి. త్రిపురలోని ముండా ప్రజలను మురా అని కూడా పిలుస్తారు. మధ్యప్రదేశ్ లో వారిని తరచుగా ముదాసు అని పిలుస్తారు.

స్వాతంత్ర్య సమర యోధుడిగా ,ఆదివాసీ వీరుడిగా,జానపద నాయకుడిగా బిర్సా ముండా కొనియాడబడుతున్నారు.బిర్సా తండ్రి సుగుణా ముండా, తల్లి కర్మి హాటులు.బిర్సా ముండా కుటుంబం క్రైస్తవ మతాన్ని స్వీకరించారు. మన దేశంలో బత్తాయి గాళ్ళు అరకొర చదువులు చదివి ఒకటే పనిగా ఉన్మాదులుగా మారి అన్యమతం అంటూ హిందూమతం ముసుగులో ప్రతి ఒక్కరి చరిత్రను వక్రీకరణ చేసి సోషల్ మీడియాలో పోస్టులు తమ మతానికి అనుకూలంగా స్వార్థ ప్రయోజనాలతో అసలు చరిత్రను మార్చేసి ద్వేషాన్ని రంగరించి పోస్టులు పెడుతున్నారు.బిర్సా ముండా ను కూడా వదలలేదు ఈ బత్తాయిలు. బిర్సా ముండా ఒక ఆదివాసీ ఆనాడు ఆదివాసీలకు చదువు ఎక్కడ ఉంది? హిందూమతం ఆదివాసీలకు చదువు ఎక్కడ చెప్పింది? శూద్రులకే చదువు చెప్పని హిందూమతం ఆదివాసీలకు చదువు ఎలా చెబుతోంది. బిర్సా ముండా క్రైస్తవ స్కూల్ లోనే చదివారు.ఆయనేం క్రైస్తవ మతాన్ని వ్యతిరేకించలేదు.ఆయన పోరాటం మతానికి వ్యతిరేకంగా కాదు. వలస పాలనకు వ్యతిరేకంగా ఆదివాసీ హక్కులు సాధనకు , ఆత్మ గౌరవ పోరాటం నడిపారు.బిర్సా ముండా క్రైస్తవ మిషనరీ స్కూల్ లో చదువుకోవడం వలన ప్రపంచ విజ్ఞానాన్ని అర్థం చేసుకుని ,దోపిడీ గురించి పసిగట్టాడు.దీంతో బ్రిటిష్ పెత్తందారీ పాలనను ఎదిరించాడు.జనంలో చైతన్యం నింపాడు.

జార్ఖండ్ లోని ఉలిహతులో (అప్పటి బెంగాల్ ప్రెసిడెన్సీ భాగంలో) ముండా ఛోటోనాగ్పూర్ పీఠభూమి ప్రాంతానికి చెందిన ముండా తెగకు చెందినవాడు. క్రైస్తవ మిషనరీల చుట్టూ తన చిన్ననాటిని గడిపేశాడు, దీని ప్రధాన లక్ష్యం ఏమిటంటే వీలైనన్ని గిరిజన ప్రజలను క్రైస్తవులుగా మార్చడం. ముండా మిషనరీ పాఠశాలకు వెళ్లారు, అక్కడ అతని గురువు జైపాల్ నాగ్ అతని పదునైన యువ విద్యార్థిని మరింత అధ్యయనం చేసి జర్మన్ మిషన్ పాఠశాలలో చేరమని ప్రోత్సహించాడు. ఇందుకోసం క్రైస్తవ మతంలోకి కూడా ఆయన మతం మార్చుకోవాల్సి వచ్చింది.

1886 మరియు 1890 మధ్యకాలంలో ముండా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సర్దార్ల ఆందోళనకు దగ్గరగా ఉండే ఝార్ఖండ్ లోని చైబాబాలో సమయాన్ని గడిపాడు. అక్కడ బ్రిటిష్ మరియు క్రైస్తవ మిషనరీలు భారతీయులకు ఏం చేస్తాయో చూసి లోతుగా ప్రభావితం చేసి భ్రమలు వ్యక్తం చేసి, ముండా క్రైస్తవమతాన్ని త్యజించి, జర్మన్ మిషన్ పాఠశాల నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నాడు.

బిర్సా ముండా కేవలం ఒకే దేవుడు మాత్రమే ఆరాధించే బిర్సాయిట్ అనే కొత్త మతం సృష్టించేందుకు వెళ్లాడు. గిరిజన సమాజంలో బిర్సాకు పెరుగుతున్న ప్రభావం వలన, బిర్సాయిట్ త్వరలోనే ముండస్ మరియు ఓరాన్స్ ల మధ్య ప్రజాదరణ పొందిన మతంగా మారింది. ‘ధర్తి అబ్బ’ లేదా భూమి యొక్క తండ్రి అనే మారు పేరుతో ముండా తన అనుచరులను వారి గిరిజనుల మూలాలకు తిరిగి వచ్చి వారి సాంప్రదాయాలను పాటించమని ప్రోత్సహించి ఆదివాసీలకు భగవాన్ బిర్సా ముండా అయ్యాడు

అతని మతం ద్వారా, ముండా కూడా ఒక బలమైన బ్రిటిష్ వ్యతిరేక భావాన్ని బోధించాడు మరియు బ్రిటిష్ పాలకులపై దాడి చేయడానికి గెరిల్లా సైన్యాలను ఏర్పాటు చేసేందుకు వేలాది మంది గిరిజన జానపద దళాలను సమీకరించాడు. 1890 ఆఖరి భాగంలో ముండా బ్రిటీష్ ఆదివాసీ అటవీ భూమిలో ప్రవేశపెట్టిన భూస్వామ్య వ్యవస్థను రద్దు చేయటానికి ముందుకు వచ్చారు. ఈ వ్యవస్థలో బ్రిటిషువారు ఇతర రాష్ట్రాల నుండి వలస వచ్చిన వారిని గిరిజన భూములపై ఎక్కించుకుని పని చేయాలని ఆహ్వానించగా, వారు వచ్చిన లాభాలన్నీ జేబులో వేసుకున్నారు. అందువలన భూభాగానికి మూల యజమానులైన వివిధ తెగలు ఈ ప్రాంతంలో తల్లడిల్లుతున్న భూసారం, ఎలాంటి జీవనోపాధినైనా వదిలి వెళ్లారు.

1900 మార్చిలో బ్రిటిష్ వారితో పాటు తన గెరిల్లా సైన్యంతో యుద్ధం చేసే సమయంలో ముండా, చక్రదర్పూర్లోని జంకోపాయ్ అడవిలో అరెస్టయ్యాడు. కొన్ని నెలల తర్వాత, 9 జూన్ న, నిర్బంధంలో ఉన్నప్పుడు అతను కన్నుమూశాడు. ఆయన మరణించిన దాదాపు ఒక దశాబ్దం తరువాత బ్రిటిష్ వారు ఛోటోనాగ్పూర్ అద్దె చట్టం (CNT) ను ప్రవేశపెట్టారు, దీని ద్వారా గిరిజన భూమిని గిరిజన యేతర పార్టీలకు బదిలీ చేయడాన్ని నిషేధించారు.

ఒక శతాబ్దానికి పైగా,ముండా యొక్క వారసత్వం ఇప్పటికీ ముఖ్యంగా బీహార్, జార్ఖండ్ లో నివసిస్తుంది మరియు కర్ణాటక మరియు ఒడిషా ప్రాంతాల్లో కొన్ని భాగాలు ఇక్కడ ఉన్నాయి.నిండా 25 సంవత్సరాలు కూడా పూర్తవకుండానే ఆదివాసీలను సమీకరించి తమ హక్కులు కోసం గొంతెత్తి పోరాటం సాగించి ఆదివాసీ రాజ్యం కోసం కలగన్న బిర్సా ముండా చిత్రపటాన్ని భారత పార్లమెంటులో పెట్టడం గొప్ప విషయం.జార్ఖండ్ విమానాశ్రయానికి బిర్సా ముండా ఎయిర్ పోర్ట్ అని నామకరణం చేశారు.

👉బిర్సా ముండా హిందూ మతం కోసం క్రైస్తవ మతాన్ని ఎదిరించాడు అంటూ వక్రీకరణ చేయడం ఓ కుట్ర.భగవాన్ బిర్సా ముండా ఆదివాసీల మూలాలు తెల్సుకొని క్రైస్తవాన్ని వద్దన్నాడు.హిందూ మతంలో చేరలేదు.ఆయన హిందువే కాదు. ఆయన ఆదివాసీ. మూలనివాసీ అతను.మతం కోసం ఆయన ప్రాకులాడలేదు.దేశానికి స్వాతంత్ర్యం కోసం, ఆదివాసీల ప్రత్యేక రాజ్యం కోసం ఆయన జననాయక్ గా పోరాటం చేశారు.

మతం మనిషి కోసం కానీ ,మనిషి మతం కోసం కాదు.ద్వేషం పెంచేది మతమే కాదు.మతం మనిషిలో ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని అలవరచాలి.సోదరభావాన్ని అలవలచాలి.సమానత్వాన్ని అందించాలి.జ్ఞానాన్ని అందించాలి.

‘జ్ఞానం’ మరియు ‘ఆయుధాలు’ విప్లవానికి రెండు ఆయుధాలు. జ్ఞానం అనే ఆయుధం ఉత్తమమైనది. ఎందుకంటే పురాతన భారతదేశంలో బుద్ధుడు మరియు ఆధునిక భారతదేశంలో బాబాసాహెబ్ డా.బి.ఆర్.అంబేడ్కర్ ఒక్క రక్తపు బొట్టు కూడా చిందించకుండా సంపూర్ణ విప్లవాన్ని తీసుకురాగలరని ప్రపంచానికి చూపించారు.

అందుకే…బిర్సా ముండా విల్లంబు నుంచి ఆదివాసీ ప్రజలకు ఆధునిక భారతంలో సరికొత్త విప్లవ మార్గాన్ని చూపిన ప్రతీక బాబాసాహెబ్!

అరియ నాగసేన బోధి
(ధమ్మ ప్రచారకులు & న్యాయవాది)

You may also like...

Translate »