విత్తన, ఎరువుల దుకాణాలను తనిఖీచేసిన వ్యవసాయ మండల అధికారి బి.వెంకన్న.

నకిలీ విత్తనాలు అమ్మితే పి.డి.యాక్ట్ నమోదు చేసి కేసులు పెడతాం.

జ్ఞాన తెలంగాణ కేసముద్రం,
జూన్ 08.

కేసముద్రం మండల వ్యవసాయ అధికారి బి వెంకన్న గారు కేసముద్రం టౌన్ లోని పలు విత్తన దుకాణాలను తనిఖీలు నిర్వహించడం జరిగింది, అందులో భాగంగా ఈరోజు వారు విత్తన రిజిస్టర్లు,స్టాక్ బుక్కులు స్టాక్ బోర్డులు , కంపెనీ పీసీలు గోడౌన్లో స్టాకు నిలువలు తనిఖీ నిర్వహించడం జరిగింది, ప్రతి డీలరు విధిగా ప్రతిరోజు స్టాక్ రిజిస్టర్,స్టాక్ బోర్డులు అప్డేట్ చేసుకోవాలని వారు సూచించడం జరిగింది, అనుమతి లేని విత్తనాలు ఎవరైనా డీలర్లు అమ్మినట్లయితే విత్తన చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని వారు డీలర్లకు సూచించారు, ప్రతి డీలరు విధిగా రైతుల వారి స్టాక్ రిజిస్టర్ మైంటైన్ చేయాలని ప్రతి రైతుకు విధిగా బిల్లులు ఇవ్వాలని వారు కోరారు.

You may also like...

Translate »