ప్రజల మనిషి… చుంచు రాజేందర్

ప్రజల మనిషి… చుంచు రాజేందర్
- ప్రజా సమస్యలపై దశాబ్దాలుగా రాజీలేని పోరాటం చేస్తున్న నాయకుడు!
- డిబిఎఫ్ జిల్లా అధ్యక్షుడు మాదాసి సురేష్!
- దళిత సంఘాల ఆధ్వర్యంలో చుంచు రాజేందర్ కు ఘన సన్మానం!
ఆత్మకూర్ జ్ఞాన తెలంగాణ దశాబ్దాలుగా మహనీయులు బాబాసాహెబ్ అంబేద్కర్ ఫూలే మొదలు మహనీయుల బాటలో పయనిస్తూ నిరంతరం ప్రజా సమస్యల కోసం పాటుపడుతున్న దళిత బహుజన ఫ్రంట్ (డిబిఎఫ్) రాష్ట్ర ఉపాధ్యక్షుడు చుంచు రాజేందర్ ప్రజల మనిషిగా చరిత్రలో నిలిచిపోతాడని డిబిఎఫ్ జిల్లా అధ్యక్షుడు మాదాసి సురేష్ అన్నారు.
ఇటీవల డిబిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా చుంచు రాజేందర్ ఎన్నికైన సందర్భంగా శనివారం ఆత్మకూరు మండలంలోని అక్కంపేట,నాగయ్య పల్లి గ్రామాలలో దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆయనతోపాటు రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికైన సిలివేరు బిక్షపతిని ఘనంగా సన్మానించారు.
అనంతరం మాదాసి సురేష్ మాట్లాడుతూ సమాజంలోని అసమానతలపై అలుపెరుగని పోరు సాగిస్తూ,అనేక ప్రజా ఉద్యమాల్లో భాగస్వామిగా నిలుస్తూ, దళిత,పీడిత, అణగారిన వర్గాలకు అండగా నిలుస్తూ,వారి సమస్యల పరిష్కారమే ప్రధాన ధ్యేయంగా,వారికి రాజ్యాంగం కల్పించిన హక్కుల పరిరక్షణ అంతిమ లక్ష్యంగా తన జీవితాన్ని త్యాగం చేసి చుంచు రాజేందర్ పోరాటం చేస్తున్నారని కొనియాడారు. చుంచు రాజేందర్ మాట్లాడుతూ తన గొంతులో ఊపిరి ఉన్నంతవరకు ప్రజల కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో డిబిఎఫ్ జిల్లా కార్యదర్శి చుంచు నరేష్, వివిధ దళిత ప్రజాసంఘాల నాయకులు సిలువేరు రమేష్, సారా మల్లయ్య, సిలువేరు సమ్మయ్య, బెల్లంపల్లి మొండయ్య, గిన్నారపు మైబు, మాదాసి కిరణ్, గిన్నారపు ప్రసంగి,మాదాసి కిషోర్, మాదాసి కట్టమల్లు, మాదాసి కౌశిక్ తదితరులు పాల్గోన్నారు.