జ్ఞాన యుద్ధం పూర్తి చేసి, రాజ్యాధికార యుద్ధం మొదలుపెట్టిన ఆర్ఎస్పి

టేక్మల్ మండల బిఎస్పి అధ్యక్షులుగా కాదులూరు గ్రామానికి చెందిన బక్క సిద్దు ఏకగ్రీవ ఎన్నిక

రాష్ట్రంలో జ్ఞాన యుద్ధం పూర్తి చేసి, రాజ్యాధికార యుద్ధం మొదలుపెట్టిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెంట బహుజన సమాజం నడవాల్సిన సమయం ఆసన్నమైనదని బిఎస్పి అందోల్ నియోజకవర్గం ఇంచార్జ్ డా.ముప్పారం ప్రకాశం అన్నాడు.

నేడు మండలం బిఎస్పీ కార్యకర్తల సమావేశం నిర్వహించి అనంతరం బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్పీ) టేక్మల్ మండల కమిటీ అధ్యక్షులుగా బక్క సిద్దు, ఉపాధ్యక్షులు జి.నగేష్, ప్రధాన కార్యదర్శిగా ఎల్లంపల్లి శ్రీనివాస్ ముదిరాజ్, కార్యదర్శి కొటంగారి అనిల్ కుమార్, కోశాధికారి బేగరీ శేఖర్, బివిఎఫ్ కన్వీనర్ గా సర్దన మోహన్, కార్యవర్గ సభ్యులుగా సురేందర్ గౌడ్, సుమన్ రాథోడ్, తుడుం భూమేషులతోపాటు 30 మంది సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

కార్యక్రమంలో బిఎస్పి అందోల్ అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షులు పల్లె కుమార్ గౌడ్, వట్టిపల్లి మండల అధ్యక్షులు పల్లె కిరణ్ కుమార్, అందోల్ మండల అధ్యక్షులు డప్పు దుర్గేష్, చౌటకూర్ మండల నాయకులు డబ్బు పోచయ్య, బేగరి హరీష్, టేక్మాల్ మండల నాయకులు శేఖర్, అనిల్, మోహన్, సురేందర్ గౌడ్, భూమేష్, సుమన్ రాథోడ్, సాయికుమార్, నగేష్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »