బిగులు వెంకటేశ్వర స్వామివారి ని దర్శించుకున్న వరంగల్ యం.పి.ఎమ్మెల్యే.కడియం శ్రీహరి.

బిగులు వెంకటేశ్వర స్వామివారి ని దర్శించుకున్న వరంగల్ యం.పి.ఎమ్మెల్యే.కడియం శ్రీహరి.

జ్ఞాన తెలంగాణ చిల్పూర్:

చిల్పూర్ : మండల కేంద్రంలోని శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి వారిని బుధవారం రోజున వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, స్టేషన్ ఘనాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కడియం శ్రీహరి దర్శించుకున్నారు ఎంపీగా గెలిసి మొదటిసారిగా ఆలయానికి విచ్చేసిన వారికి కోలాటాలు డప్పు చప్పుళ్లతో కళాకారులు ఘన స్వాగతం పలికారు ఆలయ ఈవో, ఆలయధర్మ కర్త అర్చకులు వారికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు వేదమంత్రోచరణలతో ఆశీర్వచనం చేసి స్వామి వారి తీర్థ ప్రసాదాలు వారికి అందచేశారు
ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు ప్రజలందరికీ స్వామి వారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని స్పష్టం చేశారు భక్తులకు సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు అనంతరం ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి క్షేత్రాన్ని గొప్పగా అభివృద్ధి చేస్తామని అన్నారు స్వామి వారి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజల సహకారంతో ఎమ్మెల్యేగా తను ఎంపీ గా డాక్టర్ కడియం కావ్య ఎన్నికల్లో గెలుపొందాక మా పై మరింత బాధ్యత పెరిగిందనీ పూర్తి సహకారంతో ప్రజా అవసరాలు సమస్యలపై పరిష్కారం కోసం అహర్నిశలు కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ సరిత బాలరాజ్, ఆలయ చైర్మన్ మామిడాల యాదవ రెడ్డి, మాజీ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, ఈవో లక్ష్మీ ప్రసన్న, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, పాల్గొన్నారు.

You may also like...

Translate »