మామ పై కత్తితో దాడి చేసిన అల్లుడు

మామ పై కత్తితో దాడి చేసిన అల్లుడు
జ్ఞాన తెలంగాణ
రాజేంద్ర నగర్
రాజేంద్ర నగర్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తి కత్తితో తన మామ మరియు బామ్మర్ది పై దాడికి దిగాడు ఈ దాడి తీవ్ర కలకలం సృష్టించింది. ఈ సంఘటన పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎం ఎం పహాడీ ప్రాంతంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కుటుంబ కలహాల నేపథ్యంలో అబ్దుల్లా అనే వ్యక్తి తన మామ, బావమరిదిపై మటన్ కట్ చేసే కత్తితో విచక్షణారహితంగా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో ఒక సారిగా కోపోద్రిక్తులైన స్థానికులు అబ్దుల్లాను చితకబాదారు. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరిని చికిత్స నిమిత్తం హుటాహుటిన ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియ రావలసి ఉంది. అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.”