వంక చెరువుకు మరమ్మ త్తు పనులు ప్రారంభం

జ్ఞానతెలంగాణ, చిట్యాలజూన్ 05:

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం నవాబుపేట గ్రామంలో వంక సముద్రం చెరువు మరమత్తు పనులను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆదేశాల మేరకు స్థానిక ఎంపీటీసీ సర్వ ఉమా బుధవారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపిటిసి మాట్లాడుతూ గ్రామాల సమగ్ర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చెరువు మరమ్మత్తు పనులను చేపడుతున్నామన్నారు పనులను సకాలంలో పూర్తి చెయ్యాలన్నారు ఈ కార్యక్రమంలో నవాబుపేట గ్రామ కాంగ్రెస్ కుటుంబ సభ్యులు మహిళా నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు

You may also like...

Translate »