ఆర్టీసీ బస్ సర్వీసులు సంఖ్య పెంచాలి.

పత్రికా ప్రకటన తేదీ:11/06/24 ఖమ్మం.

ఖమ్మం నగరంలో సిటీ బస్సులు నడపాలి.

POW – PYL డిమాండ్.
జ్ఞాన తెలంగాణ ఖమ్మం జూన్ 11

జిల్లా నలుమూలలకు వెళ్లే ప్రయాణికులకు బస్ సర్వీసుల సరిపడా బస్ సర్వీస్ లు లేక ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు.ప్రజల రవాణా సౌకర్యం దృష్టిలో పెట్టుకొని టి.జి ఆర్ టి సి, బస్ సంఖ్య పెంచి సర్వీసు లను నడపాలని POW-PYL కమిటీల ఆధ్వర్యంలో ఖమ్మం డిపో మేనేజర్ శ్రీనివాస్ రావు కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.

ఈ సందర్బంగా మాట్లాడుతూ
కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం మహిళలకు మంచి పథకమె అయినప్పటికీ ప్రజలకు సరిపడా సర్వీస్ లు పెంచకుండా ప్రయాణికులను ఇబ్బందులగురి చేసి మహా లక్ష్మి పథకం మహిళకు దూరం చేసే విదంగా మారింది అని వారు అన్నారు ఈ మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు అధిక సంఖ్య లో గడప దాటి ఇప్పుడిప్పుడే స్వయకృతంగా తమ పనులు రీత్యా బయటకు వస్తున్నారు, మరో రెండు రోజుల్లో స్కూల్, కాలేజ్ లు ప్రారంభం కానున్నాయి దీంతో స్కూళ్లకు కాలేజీలు, కార్యాలయాలు, ఆసుపత్రులు ఖమ్మం నగరంలో షాపింగ్ మాల్స్ లో పనిచేస్తున్న వర్కర్స్ బసు ల కోసం గంటల సమయం వేచి చుసిన బస్లు కిక్కిరిసి పోవడం తో తమ గమ్యాలు టైం కి హాజరు కాలేక పోతున్నారు, బస్ ప్రయాణం లో కిక్కిరిసి ప్రయాణికులు ఉండటం కారణంగా సడెన్ బ్రేక్స్ వేసినప్పుడు ఒకరి మీద ఒకళ్ళు పడి ఇంటర్నల్ దెబ్బలు తగిలి ప్రమాదల బారిన పడుతున్నారు, ఈ మధ్య కాలం లో కొణిజర్ల సెంటర్లో డి మార్ట్ లో పని చేసే లేడి వర్కర్ పుట్ పాత్ ప్రయాణం వలన ప్రాణాలు పోయిన సందర్భలు ఉన్నాయి అని వారు ఆవేదన వ్యక్తం చేశారు బస్సులు సమయానికి రాక బస్సు వచ్చినా కనీసం నిల్చొనే స్థలమైనా ఉండక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అని వారన్నారు.. ప్రయాణికులు సంఖ్య కి అనుగుణంగా బస్ ల సంఖ్య పెంచాలని ప్రతి ఊరుకి పల్లెవెలుగు బస్ సర్వీస్ లు నడపాలని లేని పక్షం లో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని వారు హెచ్చరించారు….

ఈ వినతిపత్రం కార్యక్రమం లో POW రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ch శిరోమణి, PYL ఖమ్మం జిల్లా అధ్యక్ష, కార్యదర్సులు ప్రేమ్ సింగ్,NV రాకేష్, POW రాష్ట్ర నాయకులు ఝాన్సీ,శోభ,PYL డివిజన్ అధ్యక్షులు సురేష్, నగర కార్యదర్శి రవీందర్, POW జిల్లా నాయకులు పూలమ్మ లలిత తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »