వర్షాకాలంలో అధికారుల అప్రమత్తంగా ఉండాలి

అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన

మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి

జ్ఞాన తెలంగాణ, (బాలాపూర్ )

వర్షాకాలం సందర్భంగా అధికారుల అప్రమత్తంగా ఉండాలని మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి అన్నారు.మహేశ్వరం నియోజకవర్గ పరిధిలో బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి నిర్వహించారు. రానున్న వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని డిప్యూటీ మేయర్ ఇబ్రమ్ శేఖర్, కమిషనర్ రఘు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మేయర్ మాట్లాడుతూ గత తీర్మానం 40 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన తీర్మానంలో ముఖ్యంగా సిసి రోడ్ల కోసం 12 కోట్ల రూపాయలు, డ్రైనేజీల నిర్మాణం కోసం 10 కోట్ల రూపాయలు బీటీ రోడ్లకు 2 కోట్ల రూపాయలు, కమ్యూనిటీ హల్ కోసం 1కోటి 70 లక్షల రూపాయలతో చేయడం జరిగింది.

వాటికోసం ప్రస్తుతానికి ఉన్న కార్పొరేషన్ బడ్జెట్ దృష్టిలో పెట్టుకుని 12 కోట్ల రూపాయలతో టెండర్ ప్రక్రియ పూర్తయింది త్వరలోనే పనుల ప్రక్రియ పూర్తిచేసి ప్రజలకు అందుబాటులో తీసుకరావాలని అధికారులను ఆదేశించారు. గత ఆరునెలల నుండి శాసనసభ ఎన్నికలు ఆ తర్వాత లోక్ సభ ఎన్నికల మోడల్ కోడ్ కారణంగా పనులు ఆగిపోవడం జరిగింది అని కోడ్ ముగిసినందున పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు. ముఖ్యంగా రానున్న వర్షాకాలం దృష్ట్యా సానిటీషన్ సిబ్బంది అప్రమత్తంగా ఉండి ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడలని సూచించారు.

హెచ్ ఎం డి ఏ నిధుల ద్వారా రోడ్ల నిర్మాణం మూడు దఫాలుగా పూర్తి చేయనున్నట్టు,అదే విధంగా నాలుగు చెరువుల నిర్మాణము త్వరలోనే పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు.ఎస్ ఎన్ డి పి పనులు దాదాపు పూర్తి అయ్యాలని కొన్ని కోర్టు కేసువల్ల మధ్యలో నిలిచింది వాటిని సైతం త్వరగా పూర్తి చేసేందుకు కృషి చేస్తామని మేయర్ అన్నారు.నాలాలు శుభ్రం చేయాలని,విధి దీపాలను సైతం త్వరితగతిన ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఈ లు జ్యోతి రెడ్డి,యాదయ్య, హెచ్ ఎం డబ్ల్యూ డీఈఈ హరీశ్, ఆర్ ఓ చంద్ర శేఖర్ రెడ్డి, ఏఈఈ లు బిక్కు నాయక్, వినీల్ గౌడ్, మేనేజర్ నగేష్ శానిటేషన్ ఇన్సిపెక్టర్ యాదగిరి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »