కాంగ్రెస్ పథకాలు.. మా గెలుపుకు పునాదులు

కేశంపేట మండల కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల ఇంచార్జ్ జడ్పిటిసి పి. వెంకటరామిరెడ్డి పోమాల్ పల్లి గ్రామంలో కాంగ్రెస్ విస్తృత ప్రచారంరాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలే ఎంపీ ఎన్నికలలో మా విజయానికి పునాదులు అవుతాయని కేశంపేట మండల కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల ఇంచార్జ్ జడ్పిటిసి పి వెంకటరామిరెడ్డి స్పష్టం చేశారు. శనివారం నియోజకవర్గంలోని కేశంపేట మండలం పోమాల్ పల్లి గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి తరఫున విస్తృత ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలతో ఆయన మాట్లాడారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంపీ అంటే చాలామంది గుర్తుపట్టని వ్యక్తి మళ్లీ ఎన్నికలలో పోటీ చేయబోతున్నారు. మరోవైపు పలు పార్టీలు మార్చి నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చి , గద్వాలలో అంతర్గత ఒప్పందాలతో తమ పార్టీ అభ్యర్థిని కాకుండా ఇతర పార్టీ నుంచి పోటీ చేసిన తన అల్లుడిని గెలిపించుకున్న డీకే అరుణ ఇప్పుడు బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉంటున్నారు. ఇప్పుడు ఆమె తన గెలుపు కోసం కృషి చేయాలని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు ఫోన్ లు చేసి అడుగుతుందనీ అని జెడ్పిటిసి వెంకట్రాంరెడ్డి ఆరోపించారు. బిజెపి నాయకులు, కార్యకర్తలే ఆమె అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. ఓటమి భయంతో డీకే అరుణ మా పార్టీ నాయకులు కార్యకర్తలను ప్రలోభ పెట్టాలని చూస్తే వారు ప్రలోభాలకు గురికారు అని పేర్కొన్నారు. రాజకీయ నిబద్దత, విశ్వసనీయత, విలువలు మరిచిపోయి మోసం చేసిన నేతలను ఇక పాలమూరు ప్రజలు విశ్వసించరు అని జెడ్పిటిసి వెంకటరామిరెడ్డి స్పష్టం చేశారు. ప్రజలు ఏ నమ్మకంతో అయితే కాంగ్రెస్ పార్టీపై నమ్మకం పెట్టుకొని గత అసెంబ్లీ ఎన్నికలలో గెలిపించారు.. ఆ నమ్మకానికి అనుగుణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు.. ఈ కార్యక్రమాలు, నిబద్ధతతో ఉన్న నాయకులు, కార్యకర్తలు ఉన్న పార్టీ అభ్యర్థిగా నైతిక విజయం ఇప్పటికే సాధించాము అన్నారు.ఎన్నికలలో ఓటర్లు అన్ని విధాల ఆలోచించి తమను భారీ మెజార్టీతో గెలిపిస్తే ఈ ప్రాంత అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తామని వెల్లడించారు.. కేపీ

You may also like...

Translate »