మీసేవ కేంద్రాల్లో అధిక డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవు:

మీసేవ కేంద్రాల్లో అధిక డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవు:
జ్ఞాన తెలంగాణ నారాయణ పేట టౌన్ జూన్ 15:
నారాయణపేట కలెక్టరేట్ లో మీసేవ కేంద్రాల నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు లో మీసేవ కేంద్రాల జిల్లా మేనేజర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ మీసేవ కేంద్రాల్లో నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఆధార్, కుల ధ్రువీకరణ , ఆదాయ పాత్రలో అనేక చోట్ల మండలాల పరిధిలోని,అధిక డబ్బులు వసూలు చేస్తున్నారని ధ్వజమెత్తారు .మీసేవ సర్వీసులు తలెత్తే సమస్యలను నివృత్తి చేశారు. త్వరలో క్యూ ఆర్ కోడ్ ద్వారా చెల్లింపులు చేసేలా కొత్త విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. ఏవో నర్సింగ్ రావు, పలు అధికారులు పాల్గొన్నారు.
