TSSO ఆధ్వర్యంలో ఉచిత ఫెర్టిలిటీ శిబిరం ప్రారంభం

జ్ఞాన తెలంగాణ
శంషాబాద్ ప్రతినిధి

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పట్టణంలో శ్రీ శ్రీనివాస హాస్పిటల్ లో నిర్వహించిన ఉచిత ఫెర్టిలిటీ శిబిరాన్ని
డాక్టర్ పంతంగి జ్యోతిష్మతి శర్మ ప్రారంభించారు.


ఈ కార్యక్రమంలో TSSO రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మీనివాస్పాల్గొని .
ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఉచిత స్కాన్, ఉచిత పరీక్షలు, మందులు ఇవ్వడంతో పాటు ప్రతి ఒక్కరు తల్లి కావాలనుకున్నప్పటికీ దురదృష్టశవత్తు తల్లి కాలేనప్పుడు సమాజం వికక్షణం ఎదుర్కొంటు కృంగిపోవనవసరం లేదుఅని అన్నారు.ప్రస్తుతం సైన్స్ సాధించిన అపూర్వమైన ప్రగతి తో అలాంటి దంపతుల నుండి అండాన్ని వీర్యాన్ని సేకరించి ల్యాబ్లో ఫలదీకరణ చేసి టెస్ట్ పద్ధతి ద్వారా పిల్లలను పుట్టించడానికి అవసరమైన అన్ని సదుపాయాలు అందరికీ అందుబాటులో రాఘవేంద్ర ఫెర్టిలిటీ సెంటర్ లో ఉన్నాయన్నారు . వైద్య చికిత్స విధానంలో అపారమైన అనుభవం కలిగిన డాక్టర్ పి.జ్యోతిష్మతి శర్మ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ రాఘవేంద్ర ఫెర్టిలిటీ సెంటర్లో ఇప్పటికే చాలామంది దంపతులు వైద్యం చేయించుకుని మాతృత్వాన్ని పొంది ఉన్నారని అన్నారు సంతానం లేనివారు బాధపడుతున్న దంపతులు శ్రీ రాఘవేంద్ర ఫెర్టిలిటీ సెంటర్ కి వచ్చి తల్లిదండ్రులు కావాలనుకునే కలను నెరవేర్చుకోవలన్నారు.


ఈ కార్యక్రమంలో TSSO రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మీసాల వంశీ, సుదర్శన్ ,జానీ తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »