విద్యార్థుల సంఖ్యకు అనుకూలంగా అన్ని గ్రామాలకు ఆర్టీసీ బస్సులను నడిపించాలి.

విద్యార్థుల సంఖ్యకు అనుకూలంగా అన్ని గ్రామాలకు ఆర్టీసీ బస్సులను నడిపించాలి.
ఙ్ఞాన తెలంగాణ, నారాయణ పేట టౌన్, జూన్ 7:
విద్యాసంస్థల పునర్ ప్రారంభ సందర్భంగా విద్యార్థుల సంఖ్యకు అనుకూలంగా అన్ని గ్రామాలకు ఆర్టీసీ బస్సులను నడిపించాలనీ పిడిఎస్ యు జిల్లా సహాయ కార్యదర్శి వెంకటేష్ అన్నారు.నారాయణపేట జిల్లా “ఆర్టీసీ డిఎం”సాయి సుధా గారికి పిడిఎస్ యు ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారాయణపేట జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు విద్యను అభ్యసించడానికి రావాలంటే వారికి రవాణా సౌకర్యం చాలా అవసరం.రవాణా సౌకర్యం సరిగా లేకపోతే మధ్యతరగతి విద్యార్థులు చదువును మధ్యలోనే ఆపేసే పరిస్థితి ఒకపక్క ఉన్నది.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా ప్రయాణికులకు ఫ్రీ బస్సు ప్రయాణం పెట్టడంతో బస్సులు కిక్కిరిసిపోతున్న పరిస్థితి.ఈ ప్రభావం విద్యార్థుల మీద ఎంతగానో చూపించే పరిస్థితి కూడా కనిపిస్తా ఉందని స్పష్టంగా అర్థం అవుతుంది.”ఆర్టీసీ డిఎం” అధికారులు చొరవ తీసుకొని విద్యార్థుల చదువులకు ఆటంకం కలగకుండా.విద్యార్థులకు అనుకూలంగా క్లాసెస్ ప్రారంభమై టైం కు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలకు ఆర్టీసీ బస్సు సర్వీస్ లను నడిపించాలని అన్నారు. తదితర డిమాండ్లతో కూడిన వినతి పత్రం ను ఆర్టీసీ డిఎం సాయిసుధ గారికి.ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో పిడిఎస్ యు నాయకులు బన్నీ,మహేష్, లాలేష్,అశోక్,సురేష్ తదితరులు పాల్గొన్నారు.