రాజీవ్ గాంధీ ఆశయాలు రాహుల్ గాంధీ తోనే నెరవేరుతాయి.

రాజీవ్ గాంధీ ఆశయాలు రాహుల్ గాంధీ తోనే నెరవేరుతాయి.
జ్ఞాన తెలంగాణ కొడకండ్ల తేదీ: 21-05-2024
భారత దేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రాగిగా ఉంచాలి అనే రాజీవ్ గాంధీ ఆశయాలు రాహుల్ గాంధీతోనే సాధ్య0 అవుతాయని కొడకండ్ల కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు దరావత సురేష్ నాయక్ అన్నారు. మంగళ వారం కొడకండ్ల లోని మండల పార్టీ కార్యాలయం లో స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా పార్టీ కార్యాలయం లో మండల పార్టీ అధ్యక్షులు దరవత్ సురేష్ నాయక్ ఆధ్వర్యం లో రాజీవ్ గాంధీ చిత్ర పటానికి పూల మాల వేసి వారికి నివాళి అర్పించారు. ఈ సందర్భ0గా ఆయన మాట్లాడుతూ భారత దేశంలో ఎన్నో సాంకేతిక సంస్కరణలు తీసుకువచ్చి దేశాన్ని ఆర్థిక రంగంలో,సాంకేతిక రంగంలో అగ్రగామిగా నిలిపారని గుర్తు చేశారు.కార్యక్రమంలో కాంగ్రెసు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.