వాహనదారుల రక్షణే ప్రధాన ధ్యేయం: సిపి డాక్టర్ బి.అనురాధ.

  • ఫైన్ లు వేయడం జరిమానా విధించడం మా అభిమతం కాదు
  • రోడ్డు ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు.
  • ఒక్క రోడ్డు ప్రమాదం కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తుంది.
  • శబ్ద కాలుష్యాన్ని సైకిల్ మోటార్ల సైలెన్సర్లను (30) తొలగించాము.
  • మైనర్ డ్రైవింగ్ 509 కేసులు నమోదు చేసాము.
  • వాహనాలకు సైరన్ లు అమర్చితే చర్యలు తప్పవు.
    జ్ఞాన తెలంగాణ సిద్దిపేట జిల్లా ప్రతినిధి మే 21.
    పోలీస్ కమిషనర్ డాక్టర్ బి.అనురాధ ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లాలో మైనర్ డ్రైవింగ్, త్రిబుల్ డ్రైవింగ్, నిబంధనలకు విరుద్ధంగా పోలీస్ సైరన్ లు, అధిక శబ్దాలు వచ్చేలా వాహనాలకు సైలెన్సర్లు బిగించే వాహనాలపై ప్రత్యేక శ్రద్ధ ఉంచి స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

గత కొన్ని రోజుల వ్యవధిలో జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా వాహనాలకు సైరన్లు బిగించిన 30 వాహనలపై కేసులు నమోదు చేసి వాహనాలు సీజ్ చేయడం జరిగిందని, త్రిబుల్ రైడింగ్ చేసే వారిపై 305 మందికి జరిమానా విధించి కౌన్సెలింగ్ నిర్వహించడం జరిగిందన్నారు.

మైనర్ డ్రైవింగ్ చేసే వారిపై 509 కేసులు నమోదు చేసి తల్లి దండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. పిల్లలను రక్షించు కోవలసిన బాధ్యత తల్లి దండ్రుల పై కూడా ఉంటుందని తల్లి దండ్రులు గమనించాలి పిల్లలు ఏది అడిగితే అది కొనివ్వవద్దని ముఖ్యంగా వాహనాల విషయంలో జాగ్రత్త వహించాలని. సరదాకు వాహనాలు నడిపి ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్న వారు ఉన్నారని పుత్ర సోకానికి గురికా వద్దని సూచించారు.

ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు నిబంధనలు తెలియని మైనర్లకు వాహనాలు ఇచ్చి వారిని ప్రోత్సహించడం వల్ల వారు తెలిసి తెలియని డ్రైవింగ్ వల్ల ప్రమాధాలకి కారణం అవుతున్నారని
దీనిని దృష్టిలో ఉంచుకొని జిల్లాలో స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించి పట్టుబడిన వారి తల్లి దండ్రులు, వాహనాల యజమానుల పై కేసులు నమోదు చేయడం జరుగుతుదని హెచ్చరించారు.

జిల్లాలో సైలెన్సర్ లను తీసివేసి శబ్ద కాలుష్యం చేసే వాహనాల పై అధిక వేగంతో త్రిబుల్ రైడింగ్ చేస్తూ ఇతరులను ఇబ్బందులకు గురి చేస్తున్న వాహనాలను సీజ్ చేయడంతో పాటుగా కేసులు నమోదు చేయడం జరుగుతుందని పోలీస్ కమిషనర్ హెచ్చరించారు.
ఈ మధ్యకాలంలో కొంత మంది సిద్దిపేట పట్టణ శివారు ప్రాంతంలో రంగనాయక సాగర్ ప్రాజెక్టు పరిసర ప్రాంతాలలో బైక్ రైడింగ్ నిర్వహిస్తున్నారని తెలిసింది వారిపై సీసీ కెమెరాలు ద్వారా ప్రత్యేక నిగా ఏర్పాటు చేయడం జరిగింది అట్టి వాహనదారులను పట్టుకొని చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి తగు చర్య తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.

నిబంధనలకు విరుద్ధంగా సైలెన్సర్లు బిగించుకున్న వాహనాలు కనబడితే వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలి సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందని. సిద్దిపేట, గజ్వేల్, పట్టణంలో సంబంధిత ట్రాఫిక్ పోలీస్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లకు సమాచారం అందించాలని పోలీస్ కమిషనర్ తెలిపారు.

You may also like...

Translate »