టెట్ ఎగ్జామ్ సెంటర్ లో గర్భిణీ మృతి

టెట్ ఎగ్జామ్ సెంటర్ లో గర్భిణీ మృతి
టెట్ పరీక్ష రాసేందుకు వెళ్లిన గర్భిణి రాధిక పరీక్ష కేంద్రంలోనే మృతి చెందింది ఈ ఘటన పటన్‌చెరు మండలం ఇస్నాపూర్‌లో శుక్రవారం ఉదయం జరిగింది.సమయానికి చేరుకోవాలనే తొందరలో పరీక్ష కేంద్రంలోని గదికి చేరుకునేందుకు ఆమె వేగంగా వెళ్లింది.ఈ క్రమంలో బీపీ ఎక్కువై పరీక్ష గదిలోనే రాధిక పడిపోయింది. హుటాహుటిన రాధికను పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రికి ఆమె భర్త అరుణ్ తీసుకెళ్లారు.అయితే అప్పటికే రాధిక మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
