నేడు తెలంగాణలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన

నేడు తెలంగాణలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన
హైదరాబాద్:ఏప్రిల్ 30లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఇవాళ ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించను న్నారు. బీజేపీ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. నేటి మధ్యాహ్నం అల్లాదు ర్గ్‌లోని ఐవీ చౌరస్తా వద్ద జరగనున్న జహీరాబా ద్-మెదక్ జనసభలోనూ ముఖ్య అతిథిగా ప్రధాని పాల్గొని ప్రసంగించను న్నారు.ప్రధాని మోడీ సాయంత్రం హెలికాప్టర్ ద్వారా జహీరా బాద్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి జహీరాబా ద్-మెదక్ జనసభ ప్రాంగణా నికి చేరుకుంటారు. అనంతరం పబ్లిక్ మీటింగ్ లో ప్రసంగిస్తారు. సభ అనంతరం జహీరాబాద్ నుంచి దుండిగల్ విమానా శ్రయానికి చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగుపయమవ్వ నున్నారు.