గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి.

గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి.
సిఐటియు మండల కార్యదర్శి జల్లే జయరాజు
జ్ఞాన తెలంగాణ కేసముద్రం,
జూన్ 07.
ఈరోజ కేసముద్రం మండల కేంద్రంలోని ఎంపీడీవో ఆఫీస్ ముందు గ్రామపంచాయతీ వర్కర్స్ ,అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) అనుబంధం, కేసముద్రం మండల గ్రామపంచాయతీ మండల అధ్యక్ష కార్యదర్శులు జాటోత్. మంగీలాల్ ,గంధసిరి. వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేసినారు.
ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి జల్లే. జయరాజు పాల్గొని మాట్లాడుతూ గత తొమ్మిది నెలల నుండి గ్రామపంచాయతీలో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు లేక, పూట గడవక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. గ్రామపంచాయతీలో కార్మికులుగా నిరుపేద కుటుంబాలకు చెందిన ఎస్సీ ,ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన వారే ఉన్నారని అన్నారు. గత ప్రభుత్వ నుండి ఈ ప్రభుత్వం వరకు 9 నెలలుగా విధులు నిర్వహిస్తున్న గ్రామపంచాయతీ కార్మికులకు వేతనాలు ఇవ్వకపోవడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేసినారు. అదేవిధంగా గ్రామపంచాయతీలో మల్టీపర్పస్ విధానాన్ని తొలగించాలని ఉద్యోగ భద్రత కల్పించాలని కనీస వేతనం నెలకు రూ. 26 వేల రూపాయలు ఇవ్వాలని , రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తక్షణమే వేతనాలు చెల్లించని ,యెడల పూర్తిగా విధులు బహిష్కరిస్తామని హెచ్చరించినారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సమాచార అధికారి, పి.సత్య ప్రకాష్ కు ఇవ్వడమైనది. ఈ కార్యక్రమంలో దుర్గం. వెంకన్న,వల్లందాస్. అనిల్ బిర్రు.లక్ష్మణ్,బాల్య నాయక్ టేకుల. శ్రీనివాస్ ,కొమ్ము. భాస్కర్,సుంచు.కొమురయ్య కొంగర.సౌందర్య ,తెల్ల. సుమలత, సుజాత,కొమ్ము. సంజీవ దొంతరబోయిన.సూరయ్య,
జాన్సన్ ధరావత్.శీను, సుంచు.శ్రావణ్ ,మరపాక. సత్యమ్మ, గుతుప.నాగన్న. దబ్బేటి.సంతు,మైదం. పవన్, లింగాడపు.యాకయ్య,దుర్గం. వెంకన్న ,దైద.తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.