ఆపిన ఆగని అక్రమ కట్టడాలు

జ్ఞాన తెలంగాణ
శంషాబాద్

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం నర్కూడ గ్రామంలో భారీ షెడ్ల నిర్మాణం చాలా రోజులుగా కొనసాగుతూ వస్తున్నాయి. 111 జీవో కు తూట్లు పొడుస్తు అక్రమంగా షెడ్లునిర్మిస్తూన్నారు. ఈ విషయం అధికారుల దృష్టికి తీసుకు వెళ్లినప్పుడు అధికారులు వచ్చి తూతూ మంత్రంగా కూల్చివేయడం తిరిగి నిర్మాణం చేపట్టడం తిరిగి నిర్మాణం చేపడుతున్నారని మళ్లీ అధికారులకు తెలియజేసినప్పుడు అధికారులు మళ్లీ వచ్చి కూల్చివేయడం మళ్లీ నిర్మాణం కొనసాగించడం జరుగుతూ వస్తుంది . భారీ నిర్మాణాలకు పర్మిషన్ లేనప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా షెడ్లను నిర్మాణం చేపట్టడం .అక్రమ కట్టడాలు కొనసాగిస్తూనే వస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి ఈ కట్టడాలను నిలిపివేయాలని స్థానికులు కోరుకుంటున్నారు. అధికారులు ఏ విధంగా చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి మరి.

You may also like...

Translate »