ప్రమాదకరంగా మారిన NH 44 జాతీయ రహదారి

ప్రమాదకరంగా మారిన NH 44 జాతీయ రహదారి
జ్ఞాన తెలంగాణ
శంషాబాద్
బెంగళూరు జాతీయ రహదారి పై నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి ఓ వైపు రోడ్డు మారమ్మతులు మరో వైపు యూ టర్న్ దెగ్గర సిగ్నల్స్ లేకపోవడంతో వేగంతో వచ్చే భారీ వాహనాలు అదుపు తప్పి ప్రమాదాలు జరగడం ప్రాణ నష్టం నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ఘన్సిమియా గూడ వద్ద రోడ్డు దాటలంటే ప్రాణాలను అర చేతిలో పట్టుకొని దాటాల్సి వస్తుందని స్థానికులు మండిపడుతున్నారు అధికారులు ప్రమాదాలు జరగకుండా సిగ్నల్ ఏర్పాటు చేయాలనీ లేద ఫ్లైఓవర్ ఫుట్ పాత్ నిర్మించాలని స్థానికులు తెలియజేసారు.
జాతీయ రహదారి నిత్యం వేల వాహనాలతో రద్దీగ అతివేగంతో వాహనాల రాకపోకలు సాగుతూ ఉండడంతో తొండుపల్లి,షాపూర్, పాలమాకుల్, తిమ్మాపూర్ ప్రాంత ప్రజలకు రోడ్డు దాటడానికి చాలా ఇబ్బంది పడుతున్నామని స్థానికులు తెలియజేసారు.