త్వరలో తెలంగాణకు కొత్త సీఎస్?

త్వరలో తెలంగాణకు కొత్త సీఎస్?
జ్ఞాన తెలంగాణ(హైదరాబాద్ న్యూస్) తెలంగాణ కు త్వరలో కొత్త సీఎస్ రాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్నికల కోడ్ ముగిసిన తరుణంలో రాష్ట్రానికి కొత్త సీఎస్ రానున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుత సీఎస్ శాంతి కుమారి స్థానంలో శశాంక్ గోయల్, కె.రామకృష్ణారావు, అరవింద్ కుమార్, జయేశ్ రంజన్, సంజయ్ జాజు, వికాస్‌రాజ్ పేర్లను సర్కారు పరిశీలిస్తోంది. సీఎస్ సహా ఐ ఏ ఎస్, ఐ పి ఎస్అధికారులను బదిలీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మరోవైపు డీజీపీ రవిగుప్తాను కొనసాగించే అవకాశం ఉందని సమాచారం తెలుస్తుంది.