కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలి

జ్ఞాన తెలంగాణ నారాయణ పేట టౌన్ జూన్ 8:

నారాయణపేట జిల్లా కేంద్రంలో భగత్ సింగ్ భవన్ లో ఐ ఎఫ్ టి యు జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు కిరణ్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య వక్తగా వచ్చినటువంటి ఐ ఎఫ్ టి యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే సూర్యం పాల్గొని మాట్లాడుతూ దేశంలో ఎన్నికల ట్రెండు ముగిసింది కానీ కార్మికుల బ్రతుకుల్లో వెలుగులు నింపుతామన్న ప్రభుత్వాలు కార్మిక హక్కులను కాల రాస్తున్నారు, మిషన్ భగీరథ, గ్రామపంచాయతీ, అంగన్వాడి, ఆశ, మున్సిపల్, మిడే మీల్స్, వర్కర్స్ కు కనీస వేతనాలు అమలు కావడం లేదు ఎన్నికల పేరుతో కార్మికులకు వేతనాలు పెండింగులో పెట్టడం సరైంది కాదన్నారు ఓడ ఎక్కకన్న ముందు ఓడ మల్లన్న ఓడ దాటినంక బోడ మల్లన్న అన్న చందంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నామని అన్నారు కార్మికుల హక్కులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హరిస్తున్నాయని కార్మికుల కనీస వేతనం 26,000 అమలు చేయాలని పిలుపునిచ్చారు. సంఘటిత అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు సరైన వేతనాలు రాక ఇబ్బందికి గురవుతున్నారని భవన మరియు ఇతర నిర్మాణరంగా కార్మికులకు సంక్షేమ బోర్డు ద్వారా చేరే లబ్ధి అందించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కార్మిక హక్కులను హరిస్తున్న ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

వివిధ రంగంలో పనిచేస్తున్న కార్మికులందరికీ పెండింగ్లో ఉన్న వేతనాలు వెంబడని ఇవ్వాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఐ ఎఫ్ టి యు జిల్లా అధ్యక్షులు కిరణ్ జిల్లా కార్యదర్శి బి నరసింహ, జిల్లా ఉపాధ్యక్షులు బోయిన్ పల్లి రాము, జిల్లా రామాంజనేయులు, జిల్లా నాయకులు డి నరసింహ, ఈశ్వరయ్య, సుశాంత్, అబ్దుల్లా, పద్మమ్మ తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »