కోడె మొక్కు కట్టి మొక్కు చెల్లించిన మండల కాంగ్రెస్ నాయకులు

జ్ఞాన తెలంగాణ: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 10వ తేదీన మానకొండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే జిల్లా కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అధ్యక్షులు సత్యనారాయణ జన్మదిన సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి సన్నిధిలో స్వామివారికి అభిషేకం చేయించి కోడిమొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూంపల్లి రాఘవ రెడ్డి, నియోజకవర్గ అధికార ప్రతినిధి పసుల వెంకటి,నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అంతగిరి వినయ్ కుమార్, మాజీ మండల కాంగ్రెస్ అధ్యక్షులు బాలపోచయ్య, కిసాన్ సెల్ అధ్యక్షులు సురేందర్ రెడ్డి,మైనార్టీ అధ్యక్షులు జమాల్, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఎర్రోజు సంతోష్,మాజీ బీసీ సెల్ అధ్యక్షులు తట్ల వీరేశం,ప్రధాన కార్యదర్శి కాసుపాక రమేష్,కుమార్,మీడియా సెల్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »