శ్రీ చైతన్య విద్యార్థుల ప్రభంజనం


తుక్కుగూడ పట్టణంలో శ్రీ చైతన్య పాఠశాలలో గత నవంబర్ మాసంలో ఐ ఎన్ టి ఎస్ ఓ పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఆ పరీక్షల్లో చాలామంది విద్యార్థులు పాల్గొన్నారు 8వ తరగతి చదువుతున్న బట్ట జోత్స్న ప్రియ అనే విద్యార్థిని మొదటి స్థానాన్ని సంపాదించుకొని లెనోవొ ట్యాబ్ సొంతం చేసుకున్నారు.

ఆరవ తరగతి శుభం సింగ్,సంగీత, ఏడవ తరగతికి చెందిన తపస్విని,శివ లావణ్య ,ఎనిమదవ తరగతికి చెందిన రెబుక, యువిక, హరిణి 9వ తరగతికి చెందిన గౌతం సాగర్,వైష్ణవి తదితరులు స్వర్ణ పథకాన్ని గెలుచుకున్నారు.

మూడవ తరగతి వి.చైత్ర, భవిషలు తృతీయ బహుమతి, రెండవ తరగతి యశస్వి, అన్నయ్య గుప్త మరియు ఒకటవ తరగతి ప్రణతి స్పెషల్ బహుమతి పొందారు. 22 మంది విద్యార్థులు కన్సో లేషన్ బహుమతులు గెలుచుకున్నారు.ఈ విషయంపై పాఠశాల ప్రిన్సిపల్ ప్రకాష్ పిల్లలను అభినందించారు.

అన్ని కార్యక్రమాలలో పోటీ పరీక్షల్లో క్రీడా రంగాలలో అన్నింటిలో వారి యొక్క ప్రతిభను కనబరిచి ఇలాంటి బహుమతులను మరెన్నో గెలవాలని ఆశించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య మేడం, స్టేట్ కోఆర్డినేటర్ జయరాజు, ఏజీఎం ఖాసీం అలీ, అకాడమిక్ కోఆర్డినేటర్ రమేష్, అకాడమిక్ డీన్ సైదులు , సి- బ్యాచ్ ఇంచార్జ్ వెంకటయ్య, ప్రైమరీ ఇన్చార్జి కల్పన, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

You may also like...

Translate »