ప్రతి ఏటా లక్షలాది మంది సందర్శకుల తో కల కల లాడే నక్లెస్ రోడ్ లోని ఎగ్జిబిషన్

ప్రతి ఏటా లక్షలాది మంది సందర్శకుల తో కల కల లాడే నక్లెస్ రోడ్ లోని ఎగ్జిబిషన్
అదిగో ఇదిగో అంటూ ఎగ్జిబిషన్ ప్రారంభ కార్యక్రమంఉసూర్ అంటూ వెను తిరుగుతున్న సందర్శకులుజ్ఞాన తెలంగాణ (హైదరాబాద్ న్యూస్) ప్రతి ఏటా లక్షలాది మంది సందర్శకుల తో కల కల లాదే నక్లెస్ రోడ్ లోని ఎగ్జిబిషన్ హైదరాబాద మహా నగరం నుండే కాకుండా లక్షలాది సందర్శకుల తో నెలల తరబడి కిట కిట లాడుతుంటుంది గత రెండేళ్ళ కరోనా తో ఈ ప్రాంతం లో ఎలాంటి ఎగ్జిబిషన్ లు ఏర్పాటు చేయలేదు.గతేడాది మరల ఇప్పుడు ఎగ్జిబిషన్ ట్రాల్స్ మరల ఏర్పాటు చేశారు.ఇటీవల నెక్లెస్ రోడ్ భారీ ఎత్తున లండన్ బ్రిడ్జి తరహాలో ఏర్పాటు ఎగ్జిబిషన్ ముఖద్వారం చాలా ఆకట్టుకుంటోంది.అన్ని హంగులను పూర్తి చేసుకున్న ఈ ఎగ్జిబిషన్ ఏప్రియల్ 25 కే ప్రారంభించాల్సి ఉన్నా ఎందుకో ఇంకా కాకపోవడం తో సందర్శకులు ఉసూరు అంటున్నారు నిత్యం సందర్శకులు పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి వస్తుంటారు అది ఎగ్జిబిషన్ సమయం లో సందర్శకుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.ఇలా అన్ని పూర్తి చేసుకున్న నక్లెస్ రోడ్ లోని ఎగ్జిబిషన్ ఎందుకు వాయిదాలు పడుతుందో అర్థం కావడం లేదు.సాయంత్రం సమయం లో బయట విహారానికి వచ్చే హుస్సేన్ సాగర్ పరివాహక ప్రాంతాలు ఎంత సందడిగా ఉంటాయో అందరికీ తెలిసిన విషయమే కానీ లండన్ బ్రిడ్జి ఎగ్జిబిషన్ వాయిదాలు పడుతుందడం తో అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటి కైన ఎగ్జిబిషన్ నిర్వాహకులు త్వరగా ప్రారంభించాలని కోరుతున్నారు.