నిరంతరం సేవా కార్యక్రమాలు చేయడమే కేవిటి లక్ష్యం

నిరంతరం సేవా కార్యక్రమాలు చేయడమే కేవిటి లక్ష్యం
కర్నాటి వెంకటేశం 57వ జయంతి వేడుకలు
ఉత్తమ విద్యార్థులను సన్మానించి నగదు బహుమతి
పేదవారికి బియ్యం పంపిణీ చేసిన
కెవిటి స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు కర్నాటి వెంకట బాల సుబ్రమణ్యం
జ్ఞాన తెలంగాణ, (మహేశ్వరం)
నిరంతరం సేవా కార్యక్రమాలు చేయడమే కేవిటి లక్ష్యం అని
కెవిటి స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు కర్నాటి వెంకట బాల సుబ్రమణ్యం అన్నారు.కర్నాటి వెంకటేశం 57వ జయంతి, కేవిటి స్పోర్ట్స్ క్లబ్ 35 వ వార్షికోత్సవం సందర్భంగా కేవిటి కోవెల నందు యజ్ఞము నిర్వహించారు.కేవిటి ఆధ్వర్యంలో గత 35 సంవత్సరాల నుండి క్రీడాలు, సాంఘిక సంక్షేమం సేవా కార్యక్రమాలు ఇప్పటివరకు 10,000 పైగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని కర్నాటి వెంకట బాలసుబ్రమణ్యం తెలిపారు. ఇటీవల పదవ తరగతిలో 10/10 వచ్చిన ఉత్తమ విద్యార్థులను శాలువాతో సన్మానించి నగదు అందజేశారు. అనంతరం పేదవారికి బియ్యం పంపిణీ చేశారు. ఇన్ని సంవత్సరాలుగా కేవీపీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమంలో కేవీటి ఆధ్వర్యంలో నిర్వహించడం సంతోషంగా ఉందని దీనికి కారణం సభ్యులు క్రమశిక్షణ ఐక్యమత్యం పట్టుదలతో పని చేయడమే అన్నారు. భవిష్యత్తులో కూడా చేనేత కార్మికులకు, విద్యార్థులకు, మహిళలకు యువతకు, ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందిస్తూ నిరంతరం సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని బాలసుబ్రమణ్యం తెలిపారు.
ఈ కార్యక్రమంలో కె వి టి స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు కర్నాటి వెంకట బాలసుబ్రమణ్యం, ఏ ఉమా శంకర్, రాజా రమేష్, పట్నం కృష్ణకుమార్, తడక యాదగిరి, మహేష్, గౌతమి స్కూల్,కృష్ణవేణి స్కూల్ ఉపాధ్యాయ బృందం స్థానికులు తదితరులు పాల్గొన్నారు.