మే 8న పటాన్చెరులో కేసీఆర్ రోడ్ షో

మే 8న పటాన్చెరులో కేసీఆర్ రోడ్ షో
ఓటు అడిగే నైతిక హక్కు బిఆర్ఎస్ పార్టీకే ఉంది
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
జ్ఞాన తెలంగాణ పటాన్చెరు ఏప్రిల్ 30
పటాన్చెరు
లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బిఆర్ఎస్ పార్టీ మెదక్ అభ్యర్థి వెంకటరామిరెడ్డికి మద్దతుగా మే 8వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు నియోజకవర్గ కేంద్రమైన పటాన్చెరు పట్టణంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సర్కిల్ వద్ద
బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్ షో జరగనుందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాలు, పట్టణాలు, డివిజన్ల నుండి భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు రోడ్ షోకు హాజరు కాబోతున్నట్లు తెలిపారు. ఇందుకు అనుగుణంగా పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ జన సమీకరణ చేయనున్నట్లు తెలిపారు. గత పది సంవత్సరాల లో చేపట్టిన అభివృద్ధి పనులను చూపెడుతూ ప్రజల ముందుకు వెళుతున్నామని, ఆరు గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తున్నామని తెలిపారు. మెదక్ గడ్డ బిఆర్ఎస్ పార్టీ అడ్డ అని, రికార్డు మెజార్టీతో వెంకట్రామిరెడ్డిని గెలిపించుకుంటామని తెలిపారు.
ఇదిలా ఉండగా.. కెసిఆర్ రోడ్ షో ను పరిష్కరించుకొని మంగళవారం పటాన్చెరు మండల పరిధిలోని ఇంద్రేశం, పెద్దకంజర్ల, చిన్న కంజర్ల, ఐనోలు, రామేశ్వరంబండ, బచ్చుగూడెం, పోచారం గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్యే జిఎంఆర్ సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకటరామిరెడ్డికి మద్దతుగా నియోజకవర్గంలోని ప్రతి గ్రామం, పట్టణం, డివిజన్ల పరిధిలోని ఇంటింటికి వెళ్లి కారు గుర్తుకే ఓటు వేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేయాలని కోరారు. దశాభి కాలంలో పటాన్చెరు నియోజకవర్గాన్ని 9వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగిందని, ఓటు అడిగే నైతిక హక్కు బిఆర్ఎస్ పార్టీకి ఉందని తెలిపారు.
ఈ సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు పాండు, సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి వెంకట్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..