టిఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేశం నామినేషన్.
జ్ఞాన తెలంగాణ భువనగిరి ఏప్రిల్ 22

భువనగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి క్యామ మల్లేష్ యాదగిరి శ్రీ లక్ష్మీనర్సింహస్వామికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం భువనగిరి కలెక్టరేట్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు.
మాజీ మంత్రివర్యులు పొన్నాల లక్ష్మయ్య,మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి,రంగారెడ్డి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు,మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి,మాజీ మంత్రి ఉమా మాధవ్ రెడ్డిలతో కలిసి క్యామ మల్లేష్ తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.
