కాంగ్రెస్ గూటికి చేరిన

కాంగ్రెస్ గూటికి చేరిన
జిల్లెలగూడ కమలం గులాబీ నేతలు
జిల్లా అధ్యక్షులు చల్ల నరసింహారెడ్డి
జ్ఞాన తెలంగాణ, (మహేశ్వరం)
మహేశ్వరం నియోజకవర్గం
మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ జిల్లెలగూడ 35వ వార్డు సీనియర్ నాయకులు కమలం గులాబీ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ జిల్లెలగూడ 35వ వార్డు సీనియర్ నాయకులు కమలం గులాబీ నేతలు చెందిన సుమారు 200 మంది నాయకులు కార్యకర్తలు రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చేరారు, దీంతో గ్రామంలో బిజెపి, బిఆర్ఎస్ గూటికి ఎదురు దెబ్బ తగిలింది. రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి కంటెస్టెడ్ కార్పొరేటర్ కే సురేష్ ఆధ్వర్యంలో సుమారు 200 మంది బిజెపి, బి ఆర్ఎస్, నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చల్ల నరసింహారెడ్డి మాట్లాడుతూ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ లో బిజెపి, టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పార్టీలో చేరడం సంతోషకరమైన విశేషం అన్నారు. చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డిని పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో కే సుధాకర్,శ్యాం కుమార్, మురళి, నరేష్, అంజయ్య, భాస్కర్, జీవరత్నం, వెంకటేష్, క్రాంతి,వినోద్,కనకయ్య,సురేష్,విష్ణు,అర్జున్,శివ,సాయి,రాజేష్,శ్రీనాథ్,అరుణ్,రాజు,గౌతమ్,జంగయ్య,రామ్ కుమార్, కిరణ్, కిరణ్,రామన్న,లక్ష్మయ్య,శంకరయ్య,బిక్షపతి పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.