-ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారి సమక్షంలో బిఆర్ఎస్ లో చేరినబీఎస్పీ రాజేంద్రనగర్ అసెంబ్లీ టీం-బీఎస్పీ ఎమేల్యే కాంటెస్టెడ్ అభ్యర్థి రాచమళ్ళ జయసింహ తో పాటు ముఖ్య నాయకుల చేరిక*జ్ఞాన తెలంగాణ రాజేంద్ర నగర్నియోజక వర్గంలో గత ఎన్నికల్లో బీఎస్పీ పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటీచేసిన రాచమళ్ళ జయసింహ మరియు అసెంబ్లీ ముఖ్య నాయకులు బిఆర్ఎస్ పార్టీలో నార్సింగి మార్కెటింగ్ కమిటీ ఛైర్మెన్ దూడల వెంకటేష్ గౌడ్ మరియు శంషాబాద్ మున్సిపల్ ఛైర్మెన్ శ్రీ కొలను సుష్మ మహేందర్ రెడ్డి మరియు పారేపల్లి శ్రీనివాస్ గౌడ్ , పేదిరిపాటి ప్రవీణ్ కుమార్ గౌడ్ గార్ల ఆధ్వర్యంలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారి చేతుల మీదుగా బిఆర్ఎస్ కండువా కప్పుకుని పార్టీలో చేరడం జరిగినది. ఈ సందర్బంగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు నాయకులకు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో బీఎస్పీ నుండి జాయిన్ అయిన వాళ్లలో రాచమళ్ళ జయసింహ తో పాటు ముక్యులు మాజీ బీఎస్పీ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు రాచమళ్ళ రాజ్కుమార్, కార్యదర్శి ఆదిరాల రవికుమార్ , శంషాబాద్ మున్సిపల్ అధ్యక్షుడు చిన్నగాండు భాస్కర్, కార్యదర్శి ఉటు అశోక్, పెద్దగండు నర్సింగ్ రావు ,ప్రధాన కార్యదర్శి చింతమోని రమేష్, కోశాధికారి రాచమళ్ళ రవీందర్, అంకేంగాళ్ళ సందీప్ , మండల నాయకులు దేశాపాగా రవితేజ ,మహేష్ , తుప్పర సునీల్, రాచమళ్ళ మదన్ మరియు యువకులు కార్యకర్తలు పార్టీలో చేరారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారితో పాటు అయన వెంట ఉన్న యువ నాయకత్వం పార్టీలోకి రావటం మంచి పరిణామం అందరు కలిసి చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గారిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. కొత్తగా చేరిన బీఎస్పీ టీం అంత తమ తమ గ్రామాలలో పార్టీ శ్రేణులతో కాలిసిపోయి పనిచేసి పార్టీ ప్రచారంలో పాల్గొనాలని దిశా నిర్దేశం చేశారు. రాచమళ్ళ జయసింహ మాట్లాడుతూ ఈ మధ్యనే డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బిఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్బంగా తామంతా అయన బాటలోనే బిఆర్ఎస్ పార్టీలో చేరటం అంతేకాకుండా రాజేంద్రనగర్ నుండి నాలుగు సార్లు తిరుగులేని విజయం సాధించి ఎమ్మెల్యే గా గెలిచి ప్రజల మనిషిగా నిలిచిన బహుజన నాయకుడు బిసి ఎమ్మెల్యే అయిన ప్రకాష్ గౌడ్ అన్న గారి నాయకత్వంలో పని చెయ్యటానికి అవకాశం రావటం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏ వర్గాలకైతే రాజ్యాధికారం రావాలన్నరో అదే వర్గాలనుండి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ఉన్నారు మరి ఇప్పుడు అదే వర్గాలకు చెందిన ముదిరాజు ముద్దు బిడ్డ కాసాని జ్ఞానేశ్వర్ గారిని చేవెళ్ల ఎంపీ గా గెలిపించుకోవడానికి పార్టీ పెద్దల పిలుపు మేరకు తప్పకుండా కష్టపడి పనిచేస్తామని అన్నారు.