వికారాబాద్ జిల్లా లో భారీ వర్షం.


జ్ఞాన తెలంగాణ న్యూస్
వికారాబాద్ జిల్లా
నవాబుపేట మండలం

వికారాబాద్ జిల్లాలో శనివారం మధ్యాహ్నం వర్షం కురిసింది. ఉదయం నుంచి వాతావరణం పొడిగానే ఉంది. మధ్యాహ్నం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమైంది. ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షం పడింది. మండల పరిధి లోని జాంబాపూర్ తదితర గ్రామాల్లో వర్షం
కురిసింది. ఈదురు గాలులతో వర్షం కురవడంతో ప్రజలు కాస్త ఉపశమనం పొందుతున్నారు. పలు గ్రామాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం కురవగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గాలివానకు వాహనదారులు అవస్థలు పడ్డారు.

You may also like...

Translate »