ప్రైవేట్ ఆస్పత్రులల్లో సి సెక్షన్ ఆపరేషన్లు తగ్గించాలి.లింగ నిర్ధారణ పరీక్షల నిర్వహణ చట్టరీత్యా నేరం.యం టి పి

ఆస్పత్రులల్లో సి సెక్షన్ ఆపరేషన్లు తగ్గించాలి.లింగ నిర్ధారణ పరీక్షల నిర్వహణ చట్టరీత్యా నేరం.యం టి పి (మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ) అర్హత కలిగి రిజిస్టర్ చేసిన తదుపరి అయిన వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే చేయాలి.*ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని రిజిస్టర్ అయి ఉండాలి.*ఆయుష్మాన్ భారత్ పోర్టల్ల్లో ప్రతి ఒక్క హాస్పిటల్ నమోదయి ఉండాలి. జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్.*ప్రభుత్వ ఆదేశాలనుసారం హెచ్ ఎమ్ ఐ ఎస్ రిపోర్టును ప్రతి నెల నమోదు చేయాలి.జ్ఞాన తెలంగాణ భూపాలపల్లి ప్రతినిధి: ప్రైవేటు ఆసుపత్రుల్లో సి సెక్షన్లు తగ్గించాలని, సాధారణ కాన్పులు జరిపించాలని ప్రతినెల సి సెక్షన్ ఆడిట్ రిపోర్ట్స్ అందచేయాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్ తెలిపారు.గురువారం జిల్లా వైద్యాది కారి కార్యాలయంలో అన్ని ప్రైవేట్ ఆస్పత్రుల యజమాన్యం మరియు డాటా ఎంట్రీ ఆపరేటర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ మధుసూదన్ మాట్లాడుతూ ఎంటిపి, గర్భసంచి తొలగించిన వారి వివరములు ప్రతి నెల ఆఫీసులో ఇవ్వాలని తెలిపారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్ట రీత్యా నేరమని, ఎవరైనా ఉల్లంఘన చేసినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయన్నారు. రిజిస్ట్రేషన్ లేకుండా ఎలాంటి ఆసుపత్రులు గాని క్లినిక్స్ కానీ నిర్వహించకూడదని, అలాంటి వారికి పదివేల నుండి రెండు లక్షల వరకు జరిమానా విధించబడుతుందని, అలాగే చట్టపరమైన కేసులు నమోదు చేయబడతాయని అన్నారు. ప్రతి హాస్పిటల్ ఫైర్, పొల్యూషన్, బయో మెడికల్ వేస్టేజ్ సర్టిఫికెట్లు కలిగి ఉండాలని హాస్పిటల్ చార్జెస్ లిస్ట్, కన్సల్టెన్సీ డాక్టర్స్ లిస్ట్ ప్రదర్శించాలని, సర్టిఫికెట్ రెన్యూవల్ కొరకై మూడు నెలల ముందే దరఖాస్తు చేయించాలని తెలిపారు. ఆయుష్మాన్ భారత్ పోర్టల్ లో విధిగా అన్ని ప్రైవేట్ ఆస్పత్రులు నమోదు చేయించుకోవాలని, ప్రతి నెల హెచ్ ఎమ్ ఐ ఎస్ పోర్టల్ లో ప్రసవాలు, అబార్షన్లు ఇన్ పేషెంట్స్ అవుట్ పేషెంట్స్ జాభితా, వారికి ఉన్నటువంటి జబ్బులు తాలూకా వివరాలు తప్పని సరిగా నమోదులు చేయాలని తెలిపారు.ప్రతి నెల ప్రసవాలు, గర్భిణీల వివరాలను హెచ్ఎంఐఎస్ పోర్టల్ లో నమోదు చేయాలన్నారు. అన్ని ప్రైవేట్ ఆస్పత్రులు ఇస్తున్నటువంటి సర్వీసెస్ ని గవర్నమెంట్ పోర్టల్ లో నమోదు చేయాలని అన్నారు. డెంగ్యూ జ్వరం నిర్ధారణ ఎలీషా టెస్ట్ ద్వారా చేయాలని, రక్తపోటు, మధుమేహం వ్యాధిగ్రస్తుల వివరాలు హెచ్ఎంఐఎస్ పోర్టల్ లో నమోదు చేయాలని సూచించారు.ఈ సమావేశంలో పిఓ ఎంసీ హెచ్ డాక్టర్ శ్రీదేవి, పిఓ డాక్టర్ ఉమాదేవి, మాస్ మీడియా అధికారి కే శ్రీదేవి, డి డి ఎం మధు, ప్రభాకర్, మరియు ప్రైవేట్ ఆసుపత్రుల యజమాన్యం, డేటా ఎంట్రీ ఆపరేటర్ల తదితరులు పాల్గొనారు.