డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు లు ఇవ్వక పోతే వచ్చే ఎన్నికల్లో మా ప్రతాపం చూపిస్తాం:ఎరుకల సంఘం

యల్ బి నగర్ లో ఉన్న ఎరుకల కులస్తులకు అర్హులైన వారందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో తమ కులస్తుల ప్రతాపం చూపిస్తామని ఎరుకల సంగం అధ్యక్షుడు జగన్నాథం గంగయ్య ప్రభుత్వం ను హెచ్చరించారు. గత రెండు వారాలుగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం నాగోల్ డివిజన్ పరిధిలోని నాంచారమ్మ బస్తీలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్ద చేస్తున్న నిరసన దీక్ష గంగయ్య ఆధ్వర్యంలో కొనసాగుతున్నది.మంగళవారం ఎరుకల కుల వృత్తిలో ఉన్న వస్తువుల తో నిరసన తెలియజేశారు. తదనంతరం ఆయన మాట్లాడుతూ తాము శాంతి యుతంగా నిరసన దీక్ష చేస్తున్న ప్రభుత్వం స్పందించక పోవడం,ఎరుకల కులస్తులు అందరూ డబ్బు ఉన్న వారు అని భ్రమ పడి పేదల పొట్ట కొట్టడం సరికాదన్నారు. తమకు అక్కడే మిగిలి ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఇచ్చేదాక తమ ఉద్యమం ఆగదని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాపమ్మ,అంజి,విజయ్,నాగమ్మ,కుమారి,నాగయ్య తదితరులు పాల్గొన్నారు

You may also like...

Translate »