ముఖ్య మంత్రివా?.. చెడ్డీ గ్యాంగ్ సభ్యుడివా?

ముఖ్య మంత్రివా?.. చెడ్డీ గ్యాంగ్ సభ్యుడివా?
- రేవంత్ పై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్
- 6 గ్యారంటీలన్నీ గారడీలే
- 125 రోజులైనా హామీలు అమలు కాలేదని కామెంట్
- ‘దొంగ హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని వాక్య
- అభయహస్తం.. అక్కరకురాని హస్తమైందని ఎద్దేవా
హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు విరుచుకుపడ్డారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలం రుద్రారంలో బీఆర్ఎ స్ ఎన్నికల ప్రచార రథాలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘దొంగ హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. వాళ్ల 6 గ్యారంటీలన్నీ గారడీలుగా మారిపోయా యి.125 రోజులైనా హామీలు అమలు కాలేదు. అభయహస్తం.. అక్కరకురాని
హస్తమైంది. పేద మహిళలకు పింఛన్లు ఇస్తామన్న రేవంత్రెడ్డి.. ఇప్పటికే లక్షల మంది మహిళల కు కి బాకీ పడ్డారు. మార్పు కావాలంటూ అధికారంలో వచ్చి ప్రజల ను మాయ చేస్తుండ్రు. వడ్లకు రూ.500 బోనస్ ఇవ్వమంటే కేసీఆర్ నీ డ్రాయర్ ఊడగొడతా అంటున్నరు. తెలంగాణ తెచ్చి పదేళ్లు సీఎంగా చేసిన వ్యక్తిపై మాట్లాడే భాష ఇదేనా? నువ్వు ముఖ్య మంత్రివా? చెడ్డీ గ్యాంగ్ సభ్యుడివా?” అని మండిపడ్డారు. హామీలన్నీ నెరవేర్చే వరకూ వదిలిపెట్టబోమన్నారు.
