వేధిస్తున్న ఎస్ఎఫ్ఏలను బదిలీ చేయాలి

–మున్సిపల్ సంఘం రాష్ట్ర కార్యదర్శి వనంపల్లి జైపాల్ రెడ్డి డిమాండ్

జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్:
వేధింపులకు గురి చేస్తున్న శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్లను వెంటనే బదిలీ చేయాలి అని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ సంఘం రాష్ట్ర కార్యదర్శి వనం జయపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలోని కుత్బుల్లాపూర్ గాజులరామారం సర్కిల్ డిప్యూటీ కమిషనర్ కు తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ స్టాప్ అండ్ ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర కార్యదర్శి వనంపల్లి జైపాల్ రెడ్డి కార్మిక నాయకులతో కలిసి శుక్రవారం మెమొరండం అందజేశారు. ఈ సందర్భంగా జైపాల్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జంట సర్కిళ్లలో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులపై విధులు పర్యవేక్షిస్తున్న శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్స్ (ఎస్ఎఫ్ఏ)లు కార్మికులను మానసికంగా లైంగికంగా వేధింపులకు గురి చేస్తూ, బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు. ఎస్ఎఫ్ఏ లను బదిలీ చేయాలని అన్నారు. ఒకే దగ్గర కొన్ని సంవత్సరాల నుంచి నిధులు నిర్వహిస్తున్న ఎస్ఎఫ్ఏ లు కార్మికులను వేధింపులకు గురి చేస్తున్నారని అన్నారు. కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలో గతంలో పారిశుధ్య కార్మికులు ఎస్ఎఫ్ఏలు వేధింపులకు గురి చేస్తున్నారని పై అధికారులకు కార్మికులు హెల్త్ ఆఫీసర్ ఏ.ఎమ్.హెచ్.ఓ కు చెప్పడం జరిగిందని తెలిపారు. కానీ హెల్త్ ఆఫీసర్ తనకేమీ తెలియదని ఎస్ఎఫ్ఏ తో మాట్లాడుకోండి అని చేతులు దులుపుకుంటూన్నారని అన్నారు. ఎస్ఎఫ్ఏ లు నెలవారి మామూళ్లకు అలవాటు పడి ఇవ్వని కార్మికులపై కక్షపూరిత చర్యలకు పూనుకుంటున్నారని అన్నారు. వారు వసూలు చేసిన డబ్బులలో అధికారులకు ముడుపులు ముట్టడంతో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవరిస్తున్నారని మహిళా కార్మికులను నైట్ డ్యూటీలు చేయాలని వేధింపులకు గురి చేస్తున్నారని అన్నారు. నైట్ డ్యూటీ మహిళా కార్మికులు విధులు నిర్వహిస్తే వారి వెంట ఒక సూపర్వైజర్ ఉండాలి కానీ ఎవరు కూడా అధికారులు లేకుండానే విధులు నిర్వహించాలని బెదిరింపులకు దిగుతున్నారని మండిపడ్డారు. తక్షణమే వీరిపై శాఖాపరమైన చర్యలు తీసుకొని అవసరమైతే వేరే సర్కిళ్లకు బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే కార్మికులతో పెద్దఎత్తున జోనల్ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామన్నారు. అధికారులు కార్మికుల సమస్యలు పరిష్కారం చేసేంతవరకు ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామన్నారు. రెండు సర్కిల్లో శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్లను అందరిని బదిలీ చేయాలని డిప్యూటీ కమిషనర్లను కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ జిల్లా కార్యదర్శి శేఖర్ , ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కే స్వామి, జిల్లా కార్యదర్శి వి శ్రీనివాసులు, రాష్ట్ర మున్సిపల్ సంగం కోశాధికారి వి హరినాధరావు, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.

You may also like...

Translate »