చేనేత కార్మికులకు పని కల్పించాలి:

జ్ఞాన తెలంగాణ భూపాలపల్లి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం వేములపల్లి గ్రామంలో చేనేత సహకార సంఘాన్ని తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు భీమనాథుని సత్యనారాయణ సందర్శించి చేనేత కార్మికుల ఇబ్బందులు తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా చేనేత కార్మికులకు పొద్దంతా పనిచేసిన రోజుకు 200 కూడా కూలి గిట్టుబాటు కావడం లేదని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నెలకు 20 వేల రూపాయల గిట్టుబాటు అయ్యే విధంగా చేనేత కార్మికులకు పని కల్పించాలని భీమనాధుని సత్యనారాయణ కోరారు. చేనేత చేయూత పథకం కొనసాగించాలని మరియు చేనేత కార్మికులు అందరికీ ప్రభుత్వం ఇందిరమ్మ గృహాలు మంజూరు చేయాలని 50 సంవత్సరాలు నిండిన పద్మశాలి మరియు చేనేత కార్మికులకు 2000 పెన్షన్ మంజూరు చేయాలని హెల్త్ కార్డులు మరియు వర్క్ షెడ్ నిర్మాణం కోసం భూమి కేటాయించాలని రాష్ట్రంలోని చేనేత కార్మికులు ఆత్మహత్యలు ఆకలి చావులు గురికాకుండా ప్రభుత్వం వెంటనే ప్రత్యేక నిధులు కేటాయించి వారిని ఆదుకోవాలని ఈ సందర్భంగా భీమనాథుని సత్యనారాయణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. చేనేత వస్త్రాలపై కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న జీఎస్టీని వెంటనే రద్దుచేసి చేనేత కార్మికులను ఆదుకోవాలని ఈ సందర్భంగా కేంద్రమును కోరారు.

You may also like...

Translate »