గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలి.

నిబంధనలపై అభ్యర్థులు, అధికారులు సమగ్రమైన అవగాహన ఉండాలి.

చిన్న పొరపాటుకు ఆస్కారం లేకుండా జాగ్రత్తగా విధులు నిర్వర్తించాలి.

మొబైల్ తో పాటు ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదు.

గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణపై చీఫ్ సూపరిండెంట్లు,* *అబ్జర్వర్ లు, రూట్ అధికారుల శిక్షణ సమావేశంలో పాల్గొన్న
జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.

జ్ఞాన తెలంగాణ భూపాలపల్లి ప్రతినిధి:

ఈ నెల 9న జరగనున్న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు.
గురువారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో
ఈ నెల 9 వ తేదీన నిర్వహించే టిజిపిఎస్సి, గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణపై రూట్ ఆఫీసర్స్, అబ్సర్వర్లు, ఇన్విజిలేటర్స్, ఛీఫ్ సూపరింటెండెంట్స్, ఫ్లయింగ్ స్క్వాడ్, పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించి, గ్రూప్ వన్ పరీక్ష నిర్వహణలో పాటించాల్సిన నియమ, నిబంధనలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో గ్రూప్ 1 పరీక్ష అత్యంత కీలకమైన పరీక్ష అని, ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కు అవకాశం లేకుండా ప్రశాంతంగా నిర్వహించాలని తెలిపారు. అభ్యర్థుల ఉజ్వల భవిష్యత్తు దృష్ట్యా ఎలాంటి చిన్న తప్పుకు ఆస్కారం లేకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు.
పరీక్షను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీగా నిర్వహించాలని అన్నారు.
జిల్లా వ్యాప్తంగా 17 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, 4394 మంది అభ్యర్థులు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్షలు రాయనున్నారని తెలిపారు. గ్రూప్ వన్ పరీక్ష కోసం 5 రూట్లను ఏర్పాటు చేసి రూట్ల వారిగా 5 గురు రూట్ ఆఫీసర్లను, 5 ఫ్లయింగ్ స్కాడ్ లను, 17 మంది సి.ఎస్ లను 17 మంది అబ్జర్వర్లు, 160 మందికి ఒక బయోమెట్రిక్ ఇన్విజిలేటర్లను, అలాగే ప్రతి పరీక్ష కేంద్రానికి ఇద్దరు చెకింగ్ అధికారులు, ఇద్దరు ఐడెంటిఫికేషన్ అధికారులు, ఇద్దరు పోలీస్ బయోమెట్రిక్ అధికారులు, బయోమెట్రిక్ అధికారులను నియమించడం జరిగిందని తెలిపారు. 9వ తేదీ ఉదయం 10:30 గంటలకు పరీక్ష ప్రారంభం
అవుతుందని అభ్యర్థులు ఉదయం 9 గంటల వరకు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని తెలిపారు.
అభ్యర్థులు తప్పనిసరిగా బయోమెట్రిక్ హాజరు వేయాలని అన్నారు. 10 గంటలకు పరీక్ష కేంద్రాల గేట్లు మూసివేస్తారని పేర్కొన్నారు. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరుగుతుందని తెలిపారు. చీఫ్ సూపరింటెండెంట్ లు, అబ్జర్వర్ లు ఎలాంటి పొరపాట్లుకు తావులేకుండా
పకడ్బందీగా విధులు నిర్వర్తించాలని పేర్కొన్నారు. ఏలాంటి చిన్న తప్పు జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పరీక్ష కేంద్రాల్లో అన్ని వసతులు సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రత్యేక అవసరాలున్న అభ్యర్థులకు గ్రౌండ్ ఫ్లోర్ కేటాయించాలని అన్నారు.
ఓఎంఆర్ షీట్లు, హాజరైన అభ్యర్థుల సంఖ్య తేడా రాకుండా చూసుకోవాలని పేర్కొన్నారు.
చీఫ్ సూపరింటెండెంట్ లు, ఆబ్జర్వర్ లు, డిపార్ట్మెంట్ అధికారులు ఉదయం 6.30 గంటలకు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అన్నారు.

మొబైల్ ఫోన్లతో పాటు ఎలక్ట్రానిక్ వస్తువులు, కాలిక్యూలేటర్లు, డిజిటల్ వాచ్ లు, పేజర్లు
పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి లేదని, అభ్యర్థులు చెప్పులు మాత్రమే ధరించి పరీక్ష కేంద్రానికి రావాలని నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు.

పరీక్ష ప్రశాంతంగా సాగేలా ప్రతి అంశాన్ని పర్యవేక్షించాలని అన్నారు. అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించా లని సూచించారు. పరీక్షా కేంద్రలలో త్రాగు నీరు సౌకర్యం కల్పించాలని అన్నారు. అభ్యర్థులు ఒక రోజు ముందే అంటే 8వ తేదీన పరీక్షాకేంద్రాన్ని పరిశీలించుకోవాలని, దానివల్ల 9వ తేదీన నిర్ణీత
న సమయానికి అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి చేరుకోవడానికి అవకాశం ఉంటుందని తెలిపారు.
పరీక్షా కేంద్రంలోకి గుర్తింపు కార్డు లేని వ్యక్తులను , అనుమానిత వాహనాలను, ఇతర అనుమానిత వస్తువులను పరీక్ష ఆవరణలో ఉండకుండా చూసుకోవాలని సి ఎస్ లను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు సరిగా పని చేస్తున్నాయో లేదో జాగ్రత్తగా పరిశీలించాలని, వీటి వల్ల పరీక్ష జరిగే విధానాన్ని పరిశీలించడం జరుగుతుందన్నారు. పరీక్షా సాఫీగా నిర్వహించేందుకు అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. పరీక్ష కేంద్రాల్లో సమయాన్ని తెలిపేందుకు ప్రతి అరగంటకు ఒకసారి గంట కొట్టాలని ఆయన స్పష్టం చేశారు.
దివ్యాంగులైన అభ్యర్థులకు టీజీపీఎస్సీ నిబంధనల ప్రకారం 50 నిమిషాలు ఎక్కువ గడువు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.
పరీక్ష కేంద్రాల్లో పారిశుద్య కార్యక్రమాలు నిర్వహించి పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు. ఎక్కువ గదులు ఉన్న పరీక్ష కేంద్రాలలో అభ్యర్థులు తమ గదిని సత్వరం గుర్తించడానికి వీలుగా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు. అత్యవసర మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, త్రాగునీరు, నిరంతర విద్యుత్ సౌకర్యం కల్పించాలని అన్నారు. పరీక్ష కేంద్రాల్లో టేబుల్స్ సరైనవి ఉండేలా చూడాలని అధికారులని ఆదేశించారు.
అనంతరం బయో మెట్రిక్ హాజరు ఏ విధంగా తీసుకోవాలనే అంశంపై అవగాహన కల్పించారు.

ఈ సమావేశంలో రీజియనల్ కో ఆర్డినేటర్ శ్యాం సుందర్, వర్టికల్ డిఎస్పి నారాయణ, ఏవో మహేష్ బాబు, పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెట్లు, అబ్జర్వర్లు, బయో మెట్రిక్ ఇన్విజిలేటర్లు తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »